గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు: కాంగ్రెసు మేయర్ అభ్యర్థి ముఖేష్ గౌడ్ తనయుడు
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందే కాంగ్రెసు పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థిని కాంగ్రెసు పార్టీ ప్రకటించింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌ను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారంనాడు ప్రకటించారు.
పార్టీ సీనియర్ నేతలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29వ తేదీన దిగ్విజయ్ సింగ్, 30వ తేదీన గులాం నబీ ఆజాగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి భారీ వ్యూహం రూపొందించినట్లు తెలిపారు.
ప్రచార కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీలో తెలంగాణ రాష్ర్టానికి చెందిన నేతలు ఉంటారని ఉత్తమ్ వెల్లడించారు. మేయర్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ యువకుడని, విద్యావంతుడని అతనిని అందరూ ఆదరించి ఓటేసి ఆశీర్వదించాలని ఉత్తమ్ పిలుపుఇచ్చారు.

సీనియర్ నేతలతో మాట్లాడి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తామని విక్రమ్ గౌడ్ చెప్పారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెసు పార్టీలో యువతకు ప్రాధాన్యం ఉందనే విషయం స్పష్టమైందని ఆయన అన్నారు.
తనను మేయర్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ర్టంలో మీడియాపై జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలు మరిచిపోవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మీడియాకు అండగా నిలిచిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications