రేవంత్ పై రెచ్చిపోయిన కోమటిరెడ్డి బ్రదర్..! తెలంగాణను అడ్డుపెట్టి..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పలు చోట్ల జర్నలిస్టులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ పై విమర్శలకు దిగారు.
తాజాగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియాపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ లో స్పందిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదన్నారు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉందని తెలిపారు. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.

అలాగే సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికీ విభజించి పాలించడమే అంటూ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదన్నారు. తద్వారా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను విభేదిస్తున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ తర్వాత రేవంత్ పై విమర్శలకు దిగుతున్న రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు…
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 4, 2025
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు…
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) August 4, 2025
ఒకప్పుడు పత్రికలు, ప్రసార సాధనాలంటే ప్రజలకు విశ్వసనీయత ఉండేదని, ప్రస్తుతం జర్నలిస్టు విలువలు పూర్తిగా తగ్గిపోయాయని, ఓనమాలు రాని వాళ్లు, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం రాని వాళ్లు జర్నలిస్టులుగా చలామణీ అవుతూ జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారని రేవంత్ ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఎవడు పడితే వాడు జర్నలిస్టు అంటూ తమ రాతలతో, చేతలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరిగే వాళ్లు కొందరు సోషల్ మీడియా జర్నలిస్టులమంటూ తమ అసభ్యకరమైన భాషతో జర్నలిజం వ్యవస్థను నిర్వీర్యం చేసి, విశ్వసనీయత దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని, మీడియా సమావేశాల్లో కొందరు కాలు మీద కాలు వేసుకుని కూర్చోని 'సీనియర్ జర్నలిస్టులకు గౌరవం ఇవ్వవా? నమస్తే పెట్టవా?' అన్నట్టు తమ వైపు చూస్తుంటారన్నారు. అలాంటి వారిని వేదిక దిగి కొట్టాలనిపిస్తోందన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
Tamil Nadu Survey: తాజా సర్వేలో బీజేపీకి భారీ షాక్- గెలిచేది మాత్రం వీరే..? -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
దానం నాగేందర్‌కు బిగ్ షాక్.. అనర్హత వేటుపై అనూహ్య ట్విస్ట్..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా?











Click it and Unblock the Notifications