అసెంబ్లీలో హెడ్‌పోన్ విసిరిన కోమటిరెడ్డి, గాయపడిన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్

Posted By:
Subscribe to Oneindia Telugu
  అసెంబ్లీలో కోమటిరెడ్డి వీరంగం, మండలి ఛైర్మన్ కంటికి గాయం

  హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్గుతగిలారు. గవర్నర్ ప్రసంగం పాఠాన్ని చింపి విసిరేశారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెడ్‌పోన్స్ విసిరేయడంతో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. చికిత్స కోసం మండలి ఛైర్మన్ ను సరోజిని కంటి ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి కాంగ్రెస్ సభ్యులు అడ్డు తగిలారు.

  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగ పాఠాన్ని చించేసి గవర్నర్ పైకి విసిరేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నిరసనపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.

  మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు గాయాలు

  మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు గాయాలు

  గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో హెడ్‌ఫోన్స్ ను తీసుకొని సిఎల్పీ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విసిరేశారు. దీంతో పోడియం వద్ద ఉన్న మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటి హెడ్‌పోన్స్ తగిలాయి. దీంతో మండలి చైర్మెన్ స్వామిగౌడ్‌ను చికిత్స కోసం సరోజిని కంటి ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కాంగ్రెస్ సభ్యుల తీరుపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది.

  నిరసన తెలిపే హక్కుంది

  నిరసన తెలిపే హక్కుంది

  శాసనసభలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని సిఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా మండలి చైర్మెన్‌పై దాడి చేయలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. నిరసనను మాత్రమే వ్యక్తం చేశానని కోమటిరెడ్డి చెప్పారు.

  హరీష్ రావు గవర్నర్‌ను కొట్టేందుకు వెళళారు

  హరీష్ రావు గవర్నర్‌ను కొట్టేందుకు వెళళారు

  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుత శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీష్ రావు గవర్నర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. నిరసన తెలిపేందుకు కూడ ప్రయత్నించకూడదంటే ఎలా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

  నా కాలికి కూడ గాయం

  నా కాలికి కూడ గాయం

  నిరసన తెలిపేందుకు తాము ప్రయత్నిస్తున్న సమయంలో మార్షల్స్ అడ్డుకొన్నారని సిఎల్పీ ఉప నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మార్షల్స్ అడ్డుకోవడంతో తన కాలికి గాయమైందని కోమటిరెడ్డి చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో రైతుల సమస్యలను ప్రస్తావించలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress MLAs did Protest in Telangana Assembly over farmers issue on Monday.Congress MLA Komati reddy venkat reddy thrown head phone on council chairman Swamy goud.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి