నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఓదార్పు..! ఎంపీగా గెలిచి ఉండాల్సిందన్న జీవన్ రెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అద్యక్ష లేమితో బాదపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ బాదను దిగమింగుకుని ఇతర పార్టీ నేతల గురించి సానుభూతి వ్యాఖ్యలు చేస్తోంది. తెలంగాణ లో ఇలాంటి విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకురాలు కవిత ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం జగిత్యాలలో కాంగ్రెస్ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఇటివల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓటమిపై మాట్లాడారు.

నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలిచుంటే ఎంతో కొంత నిజామాబాద్‌లో అభివృద్ధి జరిగేదని వ్యాఖ్యానించారు. అసలు టీఆర్ఎస్ నేతలకు తెలివే లేదని అన్నారు. అసలు వాళ్లకేగాని తెలివి ఉంటే మొన్నటి ఎన్నికల్లో కవితను ఓడిస్తారా అని ప్రశ్నించారు. ఆ పార్టీలో గ్రూపుల కుమ్ములాటలే కవితను ఓడించాయని అన్నారు. ఈరోజు కవితకు తీరని అన్యాయం చేసింది కేవలం టీఆర్ఎస్ పార్టీ నేతలే అని పెర్కొన్నారు. కవిత గెలిచుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి వ్యక్తం చేసారు.
అంతే కాకుండా జీవన్ రెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ఓటమిపై వినూత్నంగా స్పందించారు. "నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిచుంటే ఆ జిల్లా పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.

Congress MLC Jeevan Reddy consolation for Kalvakuntla Kavitha.!

టీఆర్ఎస్ నేతలకు బుర్ర పని చేయలేదని, టీఆర్ఎస్‌లో నేతల మద్య నెలకొన్న మనస్పర్థలే కవితను ఓడించాయన్నారు. ఆమెకు అన్యాయం చేసింది ఆ పార్టీ నేతలే అని అన్నారు. చంద్ర శేఖర్ రావు పంద్రాగష్టు లోపు పథకాల అమలు మీద స్పష్టత ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేసారు. ఇటివలే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన కవితపై.. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుండి గెలుపుపొందిన సంగతి తెలిసిందే. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో జగిత్యాల నుండి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన జీవన్ రెడ్డిని ఓడించడానికి కవిత అన్ని తానై కష్టపడ్డ విషయం తెలిసిందే. తనను ఓడించిన కవితపై జీవన్ రెడ్డి ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

English summary
The congress flag ceremony was held on Saturday in Jagityal. Speaking on the occasion, MLC Jeevan Reddy said, Kalvakuntla Kavitha would have been won in Nizamabad as MP, if she won there would be some development in Nizamabad, He said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X