వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ కక్ష-మీరైనా పట్టించుకోండి -కృష్ణా బోర్డు చైర్మన్‌కు రేవంత్ రెడ్డి వినతి

|
Google Oneindia TeluguNews

ఆరేళ్ల కిందటే అన్ని అనుమతులు పొంది, భూసేకరణ కోసం నిధులు కూడా మంజూరైన 'నారాయణపేట్ - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు'ను ముఖ్యమంత్రి కేసీఆర్ తొక్కిపెట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలా కనీసం కృష్ణా బోర్డయినా చొరవ చూపాలని వేడుకున్నారు. గురువారం హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంతో ఎంపీ భేటీ అయ్యారు.

Recommended Video

రాజభవన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన AICC

జీవో 69 ద్వారా మంజూరైన నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు 2014లోనే అన్ని అనుమ‌తులు ల‌భించాయని, ప్రాజెక్టు వ్యయం రూ.1450 కోట్లుకాగా... భూ సేకరణ, సర్వే తదితర పనుల కోసం మొదటి విడతగా రూ. 133 కోట్లు నిధులు కూడా మంజూరైన విషయాన్ని రేవంత్ బోర్డు చైర్మన్ దృష్టికి కు తెచ్చారు. ఈనెల 25న జరుగనున్న అపెక్స్ కమిటీ సమావేశం అజెండాలో ఈ ప్రాజెక్టును కూడా చేర్చాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. 'నారాయణపేట్ - కొడంగల్ లిఫ్ట్'కు సంబంధించి రేవంత్ రాసిన లేఖలో సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు.

ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - 'కమ్మ'కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్ఒకేచోట వైసీపీ,బీజేపీ స్క్రిప్ట్-ట్యాపింగ్ కేసులో కేంద్రం ప్రతివాది - 'కమ్మ'కాబట్టే కక్ష: టీడీపీ ఫైర్

congress mp revanth reddy meets krishna board chairman parameswaran

''ఎలాంటి వివాదాలకు తావులేని, నికర జలాలతో కూడిన, తక్కువ ఖర్చులో పూర్తిచేయగల ప్రాజెక్టు ఇది. దీన్ని తొక్కిపెట్టడం ద్వారా మీరు సాధించింది ఏంటి? కొడంగల్ ప్రజలకు ద్రోహం చేసినట్లు కాదా? విభజనకు మందే అనుమతులు లభించాయి కాబట్టి నారణపేట-కొడంగల్ స్కీముకు ఏపీ కూడా అభ్యంతర పెట్టదు. అసలు అనుమతులే లేని ఇతర ప్రాజెక్టులను అక్రమంగా కట్టుకుపోతుంటే, అన్నీ ఉన్న దీన్ని మాత్రం వదిలేశారు. తక్షణమే ఈ ప్రాజెక్టును చేపట్టండి. లేదా రైతులు, ఆ ప్రాంత ప్రజలతో కలిసి పోరాటాలు నిర్వహిస్తాం''అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.

English summary
telangana congress working president, mp revanth reddy meets krishna river board chairman paramesham in hyderabad on thursday. he urged board to complete narayanpet-kodangal irrigation project, revanth accused cm kcr for not showing interest on that project
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X