వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో పోరాటానికి రేవంత్ రెడ్డి శ్రీకారం..! యురేనియం తవ్వకాలను అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్ ఎంపీ.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలపై మరో పోరాటానికి పావులు కదుపుతున్నారు. అడవిపుత్రుల సహజ సిద్దమైన ఆస్తి యురేనియం రూపంలో నిక్షిప్తమై ఉంటే ప్రభుత్వ పెద్దలు దాన్ని కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇది ముమ్మాటికి ఆక్షేపనీయమని, ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాలరాసే కార్యక్రమానికి ఉపక్రమిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యవరణానికి పెద్ద ఎత్తున ఆటంకం కలుగుతుందని, వాతావరణం కాలూష్యానికి గురై అనేక వ్యాధులు ప్రభలుతాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గిరిజనులకు సంఘీభావంగా ఆయన ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

 తెలంగాణ లో రేవంత్ రెడ్డి మరో పోరాటం..! యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం..!!

తెలంగాణ లో రేవంత్ రెడ్డి మరో పోరాటం..! యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం..!!

యురేనియం తవ్వకాలపై మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. యురేనియాన్ని తవ్వాలని చూస్తే.. గుండెల్లో గునపం దింపుతామని, యురేనియం తవ్వకాలకు సహకరించే నేతలను అక్కడి వాసులు బహిష్కరించాలని రేవంత్ రెడ్డి గర్జిస్తున్నారు. కాగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడటానికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి యరేనియంపై పోరాటం ద్వారా ఓ గొప్ప అస్త్రం లభించింనట్లయింది. రేవంత్ రెడ్డి ఇప్పటికే తన పదునైన మాటలతో ఉద్యమాన్ని ప్రారంభించారు.

 గిరిజనుకు కాంగ్రెస్ అండ..! సహజ ప్రకృతి సంపదను కాపాడుతామంటున్న రేవంత్..!!

గిరిజనుకు కాంగ్రెస్ అండ..! సహజ ప్రకృతి సంపదను కాపాడుతామంటున్న రేవంత్..!!

ప్రజాపోరాటాల్లో, ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా, ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నేతలు వెళ్లిపోవడం. ఉన్న వారు ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించకపోవడం వంటి కారణాల వల్ల, ఇప్పటి వరకూ పెద్దగా క్షేత్ర స్థాయిలోకి రాలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం యురేనియం అంశం, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెస్తుందని, దాన్ని అస్ర్తంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశంలో రేవంత్ రెడ్డి అటు టీఆర్ఎస్‌ను, ఇటు బీజేపీని టార్గెట్ చేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

 ప్రభుత్వాల లాభాపేక్ష..! వాతావరణ కాలూష్యం ఎవరి బాద్యత అంటున్న కాంగ్రెస్..!!

ప్రభుత్వాల లాభాపేక్ష..! వాతావరణ కాలూష్యం ఎవరి బాద్యత అంటున్న కాంగ్రెస్..!!

ఇక ఇదే విషయంలో బీజేపీ ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేక పోతోంది. కేంద్రమే దీనికి అనుమతులు జారీ చేసింది కాబట్టి యురేనియం తవ్వకాలపై నోరుమెదిపే ప్రసక్తి లేనట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ కూడా అంతగా వ్యతిరేకించలేదు. ఎందుకంటే, ప్రభుత్వమే ఎన్‌వోసీ కూడా ఇచ్చింది. ఇవే అంశాలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారాయి. ఈ అంశాలను రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. యురేనియం తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీని వల్ల అనేక నష్టాలున్నాయని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

 తవ్వకాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలు..! అడ్డుకుంటామంటున్న టీ కాంగ్రెస్..!!

తవ్వకాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుపాలు..! అడ్డుకుంటామంటున్న టీ కాంగ్రెస్..!!

యురేనియం తవ్వకాల వల్ల రెండు మండలాల్లోని సుమారు అరవై వేలమంది రోడ్డున పడతారని రేవంత్ రెడ్డి ఉద్యమం ప్రారంభించారు. అరుదైన చెంచు జాతి అంతరించే ప్రమాదం ఉందని, అతిపెద్ద టైగర్ జోన్ ప్రాంతంగా నల్లమలలో తవ్వకాలు జరిపితే పులులు అంతరించే ప్రమాదం సైతం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది పర్యావరణానికి ఎంతో ప్రమాదకరమని రేవంత్ గతంలో కూడా ఉద్యమాలు నిర్వహించారు. ఇన్ని నష్టాలున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని రేవంత్ అంటున్నారు. రేవంత్ రెడ్డి పదునైన మాటలతో ఇప్పటికే ఉద్యమాన్ని ప్రారంభించగా, ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని రేపుతారో, అదే స్థాయిలో పొలిటికల్ లక్ష్యాన్ని అందుకోనే అవకాశాలు లేక పోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
Malkajgiri Congress MP Revanth Reddy is on the excavation of uranium. Revanth Reddy is roaring to boycott the residents of uranium mining. Revanth's fight against the central and state governments was a great weapon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X