టిక్కెట్టుపై కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చింది, కంచర్ల షాక్ వెనుక కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి 2019 ఎన్నికల్లో తనకు టిక్కెట్టు కేటాయింపు విషయమై హమీ వచ్చిందని టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వేం నరేందర్‌రెడ్డి ప్రకటించారు.

  చంద్రబాబు-రమణ రహస్యాలను నాయిని వినేసినట్టున్నారు : ఇప్పుడెలా? | Oneindia Telugu

  రేవంత్‌రెడ్డి వెంట వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వేం నరేందర్‌రెడ్డి వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ తరుణంలో వేం నరేందర్‌రెడ్డి గతంలో పోటీచేసిన స్థానం నుండి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు.

  ఇంతకాలం పాటు పార్టీని నమ్ముకొన్న నేతలు ఏ రకంగా స్పందిస్తారనేది రానున్న కాలంలో తేలనుంది. మరో వైపు రేవంత్ వెంట టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతల్లో కొందరికి టిక్కెట్ల కేటాయింపుపై ఇప్పటికే స్పష్టత వచ్చింది.

  2019 ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డికి హమీ

  2019 ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డికి హమీ

  2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి టిక్కెట్టు విషయమై హమీ లభించిందని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. అయితే ఏ స్థానం నుండి వేం నరేందర్‌రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నరేందర్‌రెడ్డి గతంలో టిడిపిలో ఉన్న సమయంలో పోటీచేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా. లేదా వేరే నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రేవంత్‌రెడ్డి తొలుత రాహుల్‌గాంధీతో సమావేశమైన సమయంలో రేవంత్‌తో పాటు వేం నరేందర్‌రెడ్డి కూడ ఆయనతో ఢిల్లీ వెళ్ళారు.

  పెద్దపల్లి కాంగ్రెస్ టిక్కెట్టు విజయరమణరావుకే

  పెద్దపల్లి కాంగ్రెస్ టిక్కెట్టు విజయరమణరావుకే

  2019 ఎన్నికల్లో పెద్దపల్లి అసెంబ్లీ టిక్కెట్టు విజయరమణరావుకే దక్కనుంది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయరమణరావుకు టిక్కెట్టు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూల సంకేతాలు ఇచ్చిందని సమాచారం. ఈ హమీతోనే విజయరమణరావు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

  భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం వెనుక

  భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలనే నిర్ణయం వెనుక


  రేవంత్‌రెడ్డితో నడవడానికి ముందు వరుసలలో ఉన్న కంచర్ల భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయింపు విషయంలో హమీ లభించలేదు. దరిమిలా కంచర్ల భూపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. టిఆర్ఎస్‌ పార్టీని భూపాల్‌రెడ్డి ఎంచుకొన్నారు. ఈ నెల 6వ, తేదిన భూపాల్‌రెడ్డి టిఆర్ఎస్‌లో చేరనున్నారు.

  సీతక్కకు హమీ లభించిందా?

  సీతక్కకు హమీ లభించిందా?

  2019 ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ స్థానం నుండి సీతక్క పోటీ చేస్తోందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఈ స్థానం గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది.రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీకి పరిచయం చేసిన సమయంలో రాహుల్ చాలా ఆసక్తిగా ఆమె గురించి విన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress party assured me on ticket in 2019 elections said former MLA Vemnarendar reddy. He spoke to media on Friday at Warangal.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి