హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్రకటన, ఐక్యపోరాటాలు, కాంగ్రెస్ వ్యూహమిదే

2019 ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ముందే ఖరారు చేస్తామని పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడతామని ఆయన చెప్పారు,

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ముందే ఖరారు చేస్తామని పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడతామని ఆయన చెప్పారు,

వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమౌతోంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్లు హైద్రాబాద్ లోని ఓ హోటల్ లో సమావేశమయ్యారు.

పార్టీ అనుసరించాల్సిన వ్యూహలపై చర్చించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమకేసులను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకుగాను పార్టీ నాయకులు వ్యూహరచన చేస్తున్నారు.

అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించాలని నిర్ణయం

అభ్యర్థుల పేర్లను ముందే ప్రకటించాలని నిర్ణయం

వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.

ముందుగానే అభ్యర్థుల పేర్లను నిర్ణయిస్తే పార్టీ విజయావకాశాలు మరింత మెరుగయ్యే అవకాశాలుంటాయని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం వల్ల ప్రయోజనమని భావించారు.వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఐక్యపోరాటాలకు కాంగ్రెస్ సిద్దం

ఐక్యపోరాటాలకు కాంగ్రెస్ సిద్దం

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇతర పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్యపోరాటాలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.


టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ప్రభుత్వంపై తాము నిర్వహించే పోరాటాలకు కలిసివచ్చే పార్టీలను, ప్రజాసంఘాలను కలుపుకుపోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

టెండర్లలో భారీ అవినీతి

టెండర్లలో భారీ అవినీతి

టెండర్లలో భారీ అవినీతి చోటుచేసుకొందని పిసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రెండు లక్షల కోట్ల టెండర్లలో అవినీతి చోటుచేసుకొందన్నారు. వేలకోట్లు దుర్వినియోగమయ్యాయన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వాస్తవాలను బయటపెట్టి కేసీఆర్ సర్కార్ ను ఎండగతామన్నారు.

 అక్రమకేసులను నిరసిస్తూ జైల్ భరో

అక్రమకేసులను నిరసిస్తూ జైల్ భరో


కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోందని పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.కేసీఆర్ దిష్టిబొమ్మ తగులబెడితే కూడ సీరియస్ కేసులను బనాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. కేసులకు, జైళ్ళకు తాము భయపడేది లేదన్నారు ఉత్తమ్.అక్రమ కేసులను నిరసిస్తూ జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.జైళ్ళకు వెళ్ళేందుకు తాము భయపడేది లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.విభజన చట్టంలోని హమీలను పూర్తి చేసిన తర్వాతే డీలిమిటేషన్ ను చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు భారం కాబోతోందన్నారు. ఒక ఎకరాకు సాగునీటి కోసం లక్షరూపాయాలను ఖర్చు చేసే అవకాశం ఉందన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

English summary
congress party decided to struggle against trs government. congress party senior leaders met on tuesday at hyderabad,congress party will conduct a meeting on june 2
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X