వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ప్లాన్ ఇదే!: సమ్మక్క జాతరకు రాహుల్, పీసీసీలో మార్పులు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి కసరత్తు చేస్తోంది. 2018 జనవరి మాసం నుండి తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ సభలను నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. వీలైతే సమ్మక్క సారలమ్మ జాతరకు కూడ రాహుల్‌ను రప్పించేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వ్యూహలను అనుసరిస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి టిడిపి ముఖ్య నేతలు రావడంతో ఆ పార్టీలో మరింత ఉత్సాహం వచ్చింది.

ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఎన్నికల్లో హమీలను ముందుగానే ప్రకటించే దిశగా ఆ పార్టీ కసరత్తు చేస్తోంది.

రాహుల్ సభలు

రాహుల్ సభలు

2019 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. 2018 జనవరి నుండి రాహుల్ గాంధీ సభలను నిర్వహించాలని ఆ పార్టీ యోచిస్తోంది. రాహుల్ గాందీకి వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రంలో సభలు నిర్వహించాలని ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. మెదక్ జిల్లా సంగారె్డ్డిలో రాహుల్ సభ ఇటీవల సక్సెస్ కావడంతో అదే తరహలో సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ భావిస్తోంది.

కీలక మార్పులు, రేవంత్‌కు ఏ పదవిస్తారో తెలియదు: ఉత్తమ్ కీలక మార్పులు, రేవంత్‌కు ఏ పదవిస్తారో తెలియదు: ఉత్తమ్

సమ్మక్క సారలమ్మ జాతరకు రాహుల్

సమ్మక్క సారలమ్మ జాతరకు రాహుల్

వచ్చే ఏడాదిలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రాహుల్‌గాంధీని ఆహ్వనించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర గిరిజనుల జాతరగా పేరొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది గిరిజనులు హజరౌతారు.ఈ జాతరకు రాహుల్‌ను ఆహ్వనించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ జాతర సాగుతోంది. టిడిపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క ఇదే నియోజకవర్గం నుండి 2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా విజయం సాధించింది.

2017 రౌండప్: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది, బాబుకు రేవంత్ దెబ్బ, టిఆర్ఎస్ చెక్ పెట్టే ప్లాన్ ఇదే 2017 రౌండప్: కాంగ్రెస్‌కు కలిసొచ్చింది, బాబుకు రేవంత్ దెబ్బ, టిఆర్ఎస్ చెక్ పెట్టే ప్లాన్ ఇదే

పీసీసీ కార్యవర్గంలో మార్పులు

పీసీసీ కార్యవర్గంలో మార్పులు

పీసీపీ కార్యవర్గంలో కూడ మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. టిడిపి నుండి కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినందున వారికి కూడ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించాలనే ఉద్దేశ్యంతో మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎవరికీ ఏ బాధ్యతలను కట్టబెట్టనున్నారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కళా బృందాల ద్వారా ప్రచారం

కళా బృందాల ద్వారా ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కళా బృందాల ద్వారా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఏపూరి సోమన్న నేతృత్వంలో కళా బృందాల ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకొన్నారని సమాచారం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏ ఏ అంశాలను రానున్న కాలంలో ప్రజలకు అమలు చేయనుంది, టిఆర్ఎస్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఈ బృందాలు విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయి.

దానంకు ఉత్తమ్ ఫోన్

దానంకు ఉత్తమ్ ఫోన్

మాజీ మంత్రి దానం నాగేందర్‌కు శుక్రవారం నాడు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. దానం నాగేందర్ పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగిన నేపథ్యంలో ఉత్తమ్ పోన్ చేశారు. అయితే ఈ ప్రచారాన్ని దానం కొట్టిపారేశారు. పార్టీ మారుతాననే ప్రచారంలో వాస్తవం లేదని దానం తేల్చి చెప్పారు.

English summary
congress party planning Rahul gandhi meetings in January 2018 in Telangana state. But Rahul gandhi not yet final his dates for meetings.There is a chance to changes in Tpcc committe said congress leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X