వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాగు చట్టాల రద్దు కాంగ్రెస్, రైతుల విజయం.!రైతులకు రాహుల్ గాంధీ అండగా ఉన్నారన్న వీహెచ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున స్వాగతిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు వ్యవసాయ సాగు చట్టాలు రద్దు చేయడం రైతుల మరియు విపక్షాల విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు పేర్కొన్నారు. దాదాపు 12 నెలలుగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు, పోరాటాలు చేయగా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర విపక్షాలు అండగా నిలిచిన విషయం యావత్ దేశానికి తెలిసిన అంశమేనని వి. హనుమంత రావు గుర్తు చేశారు.

 కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలు.. మొదటినుండీ వ్యతిరేకించిన కాంగ్రెస్

కేంద్రం రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాలు.. మొదటినుండీ వ్యతిరేకించిన కాంగ్రెస్

ఈ రోజు రైతులకు మరియు దేశ ప్రజలకు ప్రధాని మోది క్షమాపణలు చెప్పాడం స్వాగతిస్తున్నామని, అయితే ఇది రానున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలలో జరగబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ప్రకటనగా అటు రైతులకు ఇటు దేశ ప్రజలకు అర్ధమవుతోందని కేంద్ర ప్రభుత్వానికి చేరకలంటించారు వీహెచ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించటాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం అని అభివర్ణిస్తున్నాను.

 ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ అండ.. రైతులకు రాహుల్ గాంధీ సంఘీభావం

ఆందోళన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ అండ.. రైతులకు రాహుల్ గాంధీ సంఘీభావం

ఇదిలా ఉండగా ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధి దేశ రైతాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా వారు చేపట్టిన ఆందోళనకు మద్దతు పలికారని, రైతాంగం చేపట్టిన పలు ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా వారికి అండగా నిలిచారని గుర్తు చేసారు. ఇప్పటికైనా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సదరు వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కి తగ్గడాన్ని రైతాంగ, మరియు కాంగ్రెస్ పార్టీ విజయమని పేర్కొనక తప్పదని అన్నారు. ఈ సందర్భంలో ప్రజావ్యతిరేకమైన, రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే పరిపాలన విధానాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడని ధోరణిలోనే వ్యవహరిస్తూ ప్రజలకు అండగా ఉంటుందని వీహెచ్ స్పష్టం చేసారు.

 ఉపసంహరించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.. ఇది కాంగ్రెస్ విజయమన్న వీహెచ్

ఉపసంహరించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.. ఇది కాంగ్రెస్ విజయమన్న వీహెచ్

ఏది ఏమైనా ఎంతో మంది రైతులు ఈ ఉద్యమంలో ప్రణ త్యాగాలు చేశారని ఇది బాధాకరమైన విషయం అని వి. హనుమంత రావు అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ మూడు వ్యవసాయ సాగు చట్టాల వ్యతిరేకంగా తీర్మాణం చేసి అందుకు సంబందించిన బిల్లు పాస్ చేయడం జరిగిందని వి. హనుమంత రావు గుర్తు చేసారు. కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టంలో రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు ఉన్నాయని, ఈ చట్టాల రూపకల్పన, అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతూనే వస్తోందని వీహెచ్ స్పష్టం చేసారు.

 కేసీఆర్ ద్వంద్వ వైఖరి.. రైతు చట్టాకు సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్

కేసీఆర్ ద్వంద్వ వైఖరి.. రైతు చట్టాకు సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్

కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు ఈ మూడు బిల్లులకు వ్యతరేకంగా అసెంబ్లీలో ఎలాంటి బిల్లు పాస్ చేయలేదని, పార్లమెంట్ లో టిఅర్ఎస్ ఎంపీలు చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ మూడు వ్యవసాయ సాగు చట్టాలకు అనుకూలంగా బీజేపీ కి సహకరించిన విషయం అందరికీ తెలిసిందే అని వి.హనుమంత రావు అన్నారు. గురునానక్ జయంతి మరియు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి రోజున ప్రదని ఈ రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయడం మంచి పరిణామమని, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా రైతులకు అనుకూలంగా నిర్ణయలు తీసుకోవాలని
వి.హనుమంత రావు సూచించారు.

English summary
Senior Congress leader and former Rajya Sabha member V Hanumantha Rao said the repeal of the three agrarian laws was a victory for farmers and the opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X