జిఎస్టీ బిల్లుతో లాభమా, నష్టమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీఎస్టీ బిల్లుపై రాజ్యసభలో చర్చ నేపథ్యంలో దీని వల్ల లాభమా? నష్టమా? అనే చర్చ సాగుతోంది. జీఎస్టీ అమల్లోకి వస్తే పన్నుల భారం తగ్గి వస్తువు ధర పెరుగుతుంది. సేల్స్ ట్యాక్స్ ఉండకపోవడంతో ప్రతి రాష్ట్రంలో పన్ను చెల్లించనక్కరలేదు.

ఇక పైన పన్నుపై పన్ను ఉండదు. పన్నులు తగ్గి కంపెనీల ఏర్పాటు పెరగవచ్చు. ద్రవ్యోల్భణం దిగొస్తుందని, పన్ను ఎగవేతలు తగ్గుతాయని భావిస్తున్నారు. రవాణా వ్యయాలు, పేపర్ పని తగ్గి వ్యాపారాలు సమర్థవంతంగా జరుగుతాయి. జీడీపీ రేటు రేటు పెరగనుంది.

మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఎమ్మార్పీతో పాటు వ్యాట్, ఇతర పన్నులు వసూలు చేస్తారు. పరోక్ష పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా వసూలు చేయడంతో చిక్కులు వస్తున్నాయి. ఒకే పన్ను రెండుసార్లు కూడా కట్టవలసి వస్తోంది.

Congress Says It Will Vote For GST Reform But... Adds A Big Condition

ప్రస్తుతం వినియోగదారుడు 25 శాతం నుంచి 30 శాతం పన్ను రూపంలో చెల్లిస్తున్నాడు. 1994లో సేవల పన్ను అమల్లోకి వచ్చింది. 2005 నుంచి వ్యాట్ అమలు చేశారు. ఆ తర్వాత 2010 నుంచి జీఎస్టీ చర్చ సాగుతోంది. యూపీఏ ప్రభుత్వం 2014లో లోకసభలో ప్రవేశ పెట్టి, ఆమోదించింది.

జీఎస్టీ చట్టం మన దేశంలోని పన్ను సంస్కరణల్లో కీలకమైనది. ప్రస్తుత పన్ను విధానాలను సరళీకరించి, దేశమంతా ఏకీకృత పన్ను ఉండేలా దీనిని రూపొందించారు. సెంట్రల్, ఎక్సైజ్, రాష్ట్రాల వ్యాట్, వినోదపు పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, వినోదపు పన్ను, అమ్మకపు పన్నుల స్థానంలో వస్తు సేవల పన్ను వసూలు చేస్తారు. విద్యుత్, అల్కాహాల్, పెట్రోలియం వంటి కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Says It Will Vote For GST Reform But... Adds A Big Condition
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి