కవిత మా పార్టీలోకే.. తేల్చేసిన కాంగ్రెస్ సీనియర్..!!
కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారింది. శాసనమండలిలో రాజీనామా ఆమోదం కోసం కవిత సభా వేదికగా మాట్లాడిన సమయంలో కీలక అంశాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తనను వద్దనుకున్న పార్టీ నుంచి వచ్చిన పదవి తనకు వద్దని తేల్చి చెప్పారు. కాగా, వచ్చే ఎన్నికల్లో తన సంస్థ జాగృతి రాజకీయ సంస్థగా ఎదుగుతుందని కవిత వ్యాఖ్యానించారు. అయితే, కవిత తమ పార్టీలోకి వస్తారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత.. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా ఆమోదించాలని సభా వేదికగా ఛైర్మన్ ను కోరారు. బీఆర్ఎస్ లో తన విషయంలో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పాలన సరిగ్గా చేయలేదని ఆరోపణలు చేసారు. ఉద్యమంలో తన పాత్రను వివరించారు. కాగా.. జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. అయితే.. ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకుడు మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్ తారని ఊహించలేదని.. చివరికి వారు వచ్చారని రంగారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలోనే కవిత కాంగ్రెస్ లో చేరుతారనే వార్తలు వచ్చినా.. కవిత మాత్రం ఖండించారు.

ఇదే సమయంలో మల్ రెడ్డి రంగారెడ్డి తన సొంత పార్టీకి హెచ్చరిక చేసారు. మల్‌రెడ్డి రంగారెడ్డి ఎప్పటి నుంచో మంత్రి పదవి ఆశిస్తున్నారు. హైదరాబాద్ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని పలుమార్లు బహిరంగంగానే అడుగుతూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ఆయన ప్రస్తా విస్తూ.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం కలుగుతుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పెద్దలు ఆలోచించాలని కోరారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పుపైనా ఆయన స్పందించారు. పేరు మార్పు తనకు ఇష్టం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది కేవలం ఊహాగానమే అని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చని.. జిల్లా స్వరూపం మాత్రం మారొద్దని ప్రభుత్వాన్ని మల్‌రెడ్డి కోరారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగిందన్నారు. భూముల రేట్లు పెరుగుతున్నాయని భూములు ఎవరూ అమ్మడం లేదని విశ్లేషించారు.












Click it and Unblock the Notifications