వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో దూకుడు పెంచిన కాంగ్రెస్.. పాల్వాయి స్రవంతి ప్రచారపర్వం; కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా?

|
Google Oneindia TeluguNews

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న ముఖ్య పార్టీలు ఇప్పటికే వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగాయి. ఇక మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో, కాంగ్రెస్ పార్టీ సైతం మునుగోడు ఉప ఎన్నికకు దూకుడును పెంచింది. తమ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

మునుగోడు ఉపఎన్నిక కోసం పాట్లు పడుతున్న కాంగ్రెస్

మునుగోడు ఉపఎన్నిక కోసం పాట్లు పడుతున్న కాంగ్రెస్

త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, మండల ఇంచార్జిలు, ప్రజాప్రతినిధులు పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేశారు. మునుగోడు మండల ఇంచార్జి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ క్రమంలో పార్టీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రచార నిర్వహణను పర్యవేక్షించారు. ఇక మునుగోడులో గత కొద్ది రోజుల పాటు చౌటుప్పల్‌లో ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించారు. ఇదిలా ఉంటే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.

మునుగోడు వ్యూహాలపై భట్టి దిశా నిర్దేశం

మునుగోడు వ్యూహాలపై భట్టి దిశా నిర్దేశం

మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామగ్రామాన పర్యటించి ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల కోఆర్డినేటర్లు, బూత్ కమిటీ ఇంచార్జిలు పార్టీ గెలుపు కోసం పట్టుదలతో పని చెయ్యాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పబ్లిసిటీ మెటీరియల్‌ను గరిష్ఠంగా వినియోగించుకోవడానికి పార్టీ అనుసరిస్తున్న వివిధ వ్యూహాలను ఆయన పార్టీ నేతలకు వివరించారు . మునుగోడు ప్రజానీకాన్ని ప్రత్యర్థులకు లొంగకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సలహా ఇచ్చారు.

మునుగోడులో బీజేపీని ఆదరించరని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క

మునుగోడులో బీజేపీని ఆదరించరని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క


బిజెపికి ప్రజల మద్దతు లభించదని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం ఆయన టిఆర్ఎస్ డబ్బు, మద్యం తో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్‌, బీజేపీలను మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, డబ్బు, ఇతరత్రా ప్రలోభాలకు లోను కారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో పార్టీ నేతలకు కీలక మార్గనిర్దేశం చేశారు.

 ప్రచార పర్వంలో దూకుడుగా పాల్వాయి స్రవంతి.. సక్సెస్ అవుతారా ?

ప్రచార పర్వంలో దూకుడుగా పాల్వాయి స్రవంతి.. సక్సెస్ అవుతారా ?

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నిన్న చండూరు మండలం ఇడికుడ గ్రామంలో, గట్టుప్పల్‌ మండలంలో ప్రచారం నిర్వహించారు. తొలిరోజైన శనివారం ఆమె నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామాల వారిగా పర్యటన చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆదివారం నాడు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మునుగోడు లోని వామపక్ష పార్టీలకు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన 300 మంది సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఒకపక్క చేరికలపై దృష్టి సారిస్తూ, మరోపక్క ప్రచార పర్వం నిర్వహిస్తున్న నేతలకు దిశా నిర్దేశం చేస్తూ, ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

English summary
Congress, which has been aggressive in munugode will move ahead strategically. Palvai Sravanthi who is campaigning in villages is trying to get people's support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X