వరంగల్ తూర్పులో బలంగా వీస్తున్న 'కొండా' గాలి; టెన్షన్ లో నన్నపునేని!!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ గాలి బలంగా వీస్తోంది. తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కొండా దంపతులు ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు టెన్షన్ పుట్టిస్తుంది.
హోరాహోరీగా తూర్పులో పోరు సాగుతుండడంతో పాటు, కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న వలసలతో , మరో అయిదారుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవ్వడంతో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కుదేలవుతున్నారు.వరంగల్ తూర్పు నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వేస్తున్న ఎత్తుగడలు బి ఆర్ ఎస్ పార్టీని కుందేలు చేస్తున్నాయి.

తెరవెనుక మంత్రంగా నడిపిస్తున్న ఆయన నన్నపునేని నరేందర్ పై తీవ్ర అసహనంతో ఉన్న కార్పొరేటర్లకు గాలం వేస్తున్నారు. తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కార్పొరేటర్లను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, రామ తేజస్వి శిరీష్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పిఎసిఎస్ చైర్మన్ కేడల జనార్ధన్ తో పాటు బీఆర్ఎస్ లో ప్రాధాన్యం దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న నవీన్ రాజ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఏకంగా రేవంత్ రెడ్డి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కప్పుకున్నారు. ఇక ఈ పరిణామాలు నన్నపునేని నరేందర్ కు షాక్ అని చెప్పాలి. నన్నపునేని నరేందర్ వ్యవహార శైలి నచ్చని చాలామంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాట పట్టడం ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో కనిపిస్తుంది. ప్రస్తుతం నన్నపనేని నరేందర్ తో తిరుగుతున్న చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీ వంక చూస్తున్నారని టాక్ వినిపిస్తుంది.
కార్పొరేటర్ లతో పాటు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ స్థాయి కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనుండడంతో భారీ స్థాయిలో నన్నపునేని నరేందర్ కు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక ఈ పరిణామాలు వరంగల్ తూర్పులో కొండా దెబ్బకు నన్నపునేని నరేందర్ టెన్షన్ పడుతున్నాడని స్థానికంగా చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications