చీర, గాజులు కేసీఆర్ కే .. చెప్పు చూపించి పాడి కౌశిక్ రెడ్డికి హెచ్చరిక!
బిఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సొంతపార్టీ ఎమ్మెల్యేలపైన నిప్పులు చెరిగి వారిపైన తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో పాటు వారికి చీర, గాజులు పంపించారు. చీర, గాజులు కొనుక్కొని, వాటిని వేసుకొని నియోజకవర్గాలలో పర్యటించాలంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మండిపడుతున్నారు.
మహిళలను అడ్డు పెట్టుకునే ఎమ్మెల్యే గా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మహిళా కార్పొరేషన్ చైర్మన్ పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ మహిళలను అవమానిస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతున్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ మహిళలకు పోరాట స్ఫూర్తి ఉందని పేర్కొన్న శోభారాణి మహిళలను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిచారు అంటూ పాడి కౌశిక్ రెడ్డి పై మండిపడ్డారు.

మొదట చీర, గాజులు కేసీఆర్ కే పంపాలి
ఆయన చీర, గాజులు పంపాలి అనుకుంటే మొదట కెసిఆర్ కే పంపాలని, పార్టీ ఫిరాయింపులు టిఆర్ఎస్ పార్టీలోనే పుట్టాయని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుండి చేరిన నాయకులతోనే టిఆర్ఎస్ పార్టీ పుట్టిందని, కెసిఆర్ రాజకీయ పుట్టుక ఎక్కడ ఉందో చూసుకోమంటూ ఎద్దేవా చేశారు. మహిళలను చులకన చేసి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మండిపడ్డారు.
చెప్పు చూపించి హెచ్చరిక
పాడి కౌశిక్ రెడ్డికి చెప్పు చూపించి మహిళలను అగౌరవపరిస్తే చెప్పు దెబ్బల పాలవుతారు అంటూ హెచ్చరించారు. వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే బయట తిరగనివ్వమంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలని, ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
మహిళా కమీషన్ సుమోటోగా తీసుకోవాలి
ఇక మహిళా కమిషన్ పార్టీ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణకు పిలవాలని, ఆయనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, అంతమాత్రాన వారిని, వారి పేరుతో ఆడవారిని అవమానించడం మంచిది కాదని హితవు పలికారు.
నీ చరిత్ర అది
ఇక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డికి పాడె ఎక్కే సమయం వచ్చిందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిదన్నారు. భార్యా,బిడ్డను అడ్డుపెట్టుకొని చనిపోతామని ప్రచారం చేసి గెలిచారని ఎద్దేవా చేశారు. పాడి కౌశిక్ రెడ్డి పతివ్రత శిరోమణి లీడర్ అన్నట్టు మాట్లాడుతున్నాడని, మహిళల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications