హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి, స్కూల్ బస్సు బీభత్సం
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట పోలీసు క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో చోటుచేసుకున్న మిస్‌ఫైర్‌లో అక్కడ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ ఖాజా మొయినుద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయన స్వస్థలం నల్లగొండ జిల్లాలోని వలిగొండ.
ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. తుపాకీ పేలిన కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన పోలీసుక్వార్టర్స్‌లో విషాదాన్ని నింపింది.
స్కూల్ బస్సును ఢీకొన్న లారీ: ఐదుగురు చిన్నారులకు గాయాలు
హైదరాబాద్‌లోని కర్మన్ ఘాట్‌లో సోమవారం ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చిన లారీ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు సహా ఆటో, బైక్ లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు సహా పది మందికి గాయాలయ్యాయి.
గాయపడ్డ విద్యార్ధులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిర్లక్ష్యంగా లారీని నడిపిన డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications