శర వేగంగా ఢిల్లీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం.!పనులను పరిశీలించిన మంత్రి వేముల.!
న్యూ ఢిల్లీ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆ దిశగా దూకుడు పెంచిన సందర్బం కనిపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం ఉంటే ఇతర రాష్ట్రాల వ్యవహారాలు చూసుకోవడం తేలికవుతుందనే ఉద్దేశంతో ఓ బృహత్కర కార్యాలయాన్ని నిర్మిస్తోంది బీఆర్ఎస్ పార్టీ.
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నేతలు కొంత మంది ఢిల్లీ లో తిష్టవేసీ పార్టీ బలోపేతానికి చర్యలుతీసుకునే దిశగా చంద్రశేఖర్ రావు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్టీని విస్తరించడంతో పాటు కాంగ్రెస్, బీజేపి వంటి జాతీయ పార్టీలకు ధీటుగా పార్టీని పటిష్టం చేసేందుకు చంద్రశేఖర్ రావు పావులు కదుపుతున్న అంశం తెలిసిందే.

ఇదిలా ఉండగా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో వసంత్ విహార్ లో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను బుధవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆలోచనల ప్రకారం బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్ పై మంత్రి నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేసారు.
కార్యాలయ ఫర్నీచర్ పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని మంత్రి వారికి స్పష్టం చేశారు. మంత్రి వెంట ఆర్కిటెక్ట్ ఆస్కార్, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.












Click it and Unblock the Notifications