కన్ఫమ్ అయిన బస్సు టికెట్ రద్దు- ప్రయాణికుడికి 10 వేల పరిహారం-వినియోగదారుల ఫోరం తీర్పు

ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణించేందుకు వ్యక్తి ముందుగా టికెట్ బుక్ చేసుకున్నాడు. దాన్ని సదరు ఆపరేటర్ కూడా కన్ఫమ్ చేశాడు. చివరి నిమిషంలో టికెట్ క్యాన్సిల్ చేశాడు. దీంతో ఆ బస్సులో ఎక్కాల్సిన సదరు ప్రయాణికుడు వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీంతో విచారణ జరిపిన వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రయాణికులకు కలిగిన సేవా లోపానికి గానూ ఆపరేటర్ సదరు ప్రయాణికుడికి 10 వేల జరిమానా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అసలేం జరిగిందంటే... ఫిర్యాదుదారు గతేడాది ఆగస్టు 23న హైదరాబాద్ లో ఆరెంజ్ ట్రావెల్స్ ఏసీ బస్ టిక్కెట్‌ను బుక్ చేసారు. బస్ సర్వీస్ ప్రొవైడర్‌కి తగిన మొత్తం చెల్లించిన తర్వాత ఈ టికెట్ కన్ఫమ్ చేశారు. అయితే ఈ బస్సు పలు కారణాలతో అందుబాటులో లేకుండా పోయింది. దీంతో సదరు ప్రయాణికుడికి ఇచ్చిన టికెట్ ను రద్దు చేశారు. దీంతో ప్రయాణికుడికి టికెట్ కోసం చెల్లించిన మొత్తం తిరిగి ఇస్తామని ఆపరేటర్ హామీ ఇచ్చారు. అనంతరం ప్రయాణికుడు మరో బస్సు బుక్ చేసుకుని తాను వెళ్లాల్సిన గమ్యానికి చేరుకున్నాడు.

consumer court

అయితే ఆ తర్వాత సదరు ప్రయాణికుడు తనకు కలిగిన సేవా లోపంపై ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉన్న లీగల్ హ్యూమన్స్ అనే లీగల్ ఎయిడ్ ఇనిషియేటివ్ ఫిర్యాదుతో కూడిన ట్వీట్‌ను గమనించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసింది. దీంతో వినియోగదారుల ఫోరం దీనిపై విచారణ జరిపింది. ఆపరేటర్ తో పాటు ప్రయాణికుల నుంచి వాంగ్మూలాలు తీసుకుంది. ఆ తర్వాత తన తీర్పు ప్రకటించింది.

ఇందులో హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం.. ఆరెంజ్ ట్రావెల్స్ ఆపరేటర్‌కు చివరి నిమిషంలో బస్సు రద్దు చేసి టికెట్ క్యాన్సిల్ చేసి సేవా లోపానికి కారణమైనందుకు ... సదరు ప్రయాణికుడికి 10 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. వినియోగదారుల ఫోరం తన తీర్పులో ఆరెంజ్ టూర్స్‌కు టిక్కెట్ ఖర్చుతో పాటు రూ.55 వడ్డీతో పాటు పరిహారం మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఇప్పుడు ఈ తీర్పు ప్రయాణికులకు పెద్ద ఊరటగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+