హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ గొప్ప భవిష్యత్తు, క్రికెట్ నచ్చింది: హైద్రాబాద్‌పై టిమ్ కుక్ ప్రేమ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: యాపిల్ సీఈవో టిమ్ కుక్ హైదరాబాదుతో ప్రేమలో పడిపోయారు! నగరంలోని కల్చర్, హిస్టరీ తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. ముఖ్యంగా జీ నారాయణమ్మ మహిళా కళాశాల విద్యార్థినుల ప్రతిభ అద్భుతమని కితాబిచ్చారు.

ఆ విద్యార్థినులను కలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. హైదరాబాదీయుల ప్రతిభకు ముగ్ధుడైపోయిన టిమ్ కుక్ తన ఆనందాన్ని శుక్రవారం ఆ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

జీ నారాయణమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన ఆయన హైదరాబాద్ సంస్కృతి, చరిత్రకు ముగ్ధుడనయ్యానని చెప్పారు. ఇప్పటికే నగరం ప్రేమలో పడిపోయానన్నారు. ఆ కాలేజీ మహిళా కళాశాల అని, కొత్త మ్యాక్ ల్యాబ్ దగ్గర అత్యుత్తమ ప్రతిభ, ఉత్సాహం ఉందని ట్విట్టర్లో తెలిపారు.

మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందించానని టిమ్ కుక్ వారి ఫోటో పెట్టి ట్వీట్ చేశారు. గురువారం కాలేజీని సందర్శించిన కుక్ అక్కడ కంప్యూటర్ సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే యాపిల్ విద్యార్థులకు శిక్షణకు సంబంధించిన ఓ అవగాహన పత్రంపై సంతకం చేశారు.

భారత్‌కు గొప్ప భవిష్యత్తు

భారత ప్రజల గురించి, ఇక్కడి సంస్కృతి, వ్యాపారం జరిగే విధానం గురించి, ప్రజల ఆసక్తులు, వాళ్ల ఆశలు తెలుసుకోవడానికి భారత్‌ వచ్చానని, వీటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్లబోతున్నానని చెప్పారు.

క్రికెట్‌ చాలా బాగా నచ్చిందని, అందులో ఉత్సాహం, శక్తి ఉన్నాయన్నారు. భారతీయుల ప్రతిభ అద్భుతమన్నారు. యాపిల్‌ రిటైల్‌కు భారత్‌లో మంచి భవిష్యత్తు ఉన్నట్లు భావిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో స్వల్పకాలం కాదు.. సుదీర్ఘకాలం యాపిల్‌ ఉండాలని అనుకుంటున్నానని చెప్పారు.

భారత్‌ పెద్ద దేశమన్నారు. మేం శక్తిమంతులం అనుకోవడం లేదని, ప్రజల సాధికారితే తమ లక్ష్యమన్నారు. ఎప్పుడూ మేము వినియోగదారుడి తరఫున నిలబడతామని, వారి డేటా భద్రతకు మేము సహకారం అందిస్తామని వారు నమ్ముతున్నారన్నారు. భారత్‌లో జరుగుతున్న సంస్కరణల కారణంగా దేశానికి గొప్ప భవిష్యత్తు ఉందన్నారు.

English summary
Apple CEO Tim Cook, who visited G Narayanamma Institute of Technology and Science (for women) campus in Hyderabad on Thursday, was left impressed by the local talent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X