ప్రియుడి చేతిలో సౌమ్య హత్య: కూతురు మృతిపై తండ్రి ఇలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎర్రగడ్డలో సంచలనం సృష్టించిన సౌమ్య హత్య కేసును పోలీసులు నాలుగు రోజుల్లో ఛేదించిన విషయం తెలిసిందే. భర్త నాగభూషణం స్నేహితుడు ప్రకాశ్ ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రకాశ్‌తో సౌమ్యకు చనువు కూడా ఉందని తేలింది.

  డబ్బు విషయంలో తలెత్తిన వివాదమే హత్యకు కారణం

  చదవండి: హత్య కేసులో ట్విస్ట్‌లు: ఫ్రెండ్‌కు మర్యాదలు చేస్తే.. సౌమ్యతో వివాహేతర సంబంధం, మద్యం తాగిన సౌమ్య

  దీనిపై సౌమ్య తండ్రి స్పందించారని తెలుస్తోంది. తన కూతురు తప్పుడు పనులు చేసిందని, తప్పుడు పనులు చేస్తే ఎవరి జీవితాలు అయినా ఇలాగే అర్ధాంతరంగా ముగిసిపోతాయని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర వయస్సున్న తన మనవడు తల్లిలేని వాడయ్యాడని కంటతడి పెట్టారు.

  డబ్బు కోసం సౌమ్య హత్య

  డబ్బు కోసం సౌమ్య హత్య

  కట్టుకున్న భర్త నాగభూషణంకు ద్రోహం చేసి అతడి స్నేహితుడు ప్రకాశ్‌తో సౌమ్య అనైతిక సంబంధం పెట్టుకున్నట్లుగా తేలిన విషయం తెలిసిందే. డబ్బుల కోసం చివరకు ఆమెను అదే ప్రియుడు చంపేశాడు. పోలీసులు ప్రకాశ్‌ను అరెస్టు చేశారు. డబ్బు ఇవ్వనందుకే ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, చంపేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.

  పలు కోణాల్లో కేసు దర్యాఫ్తు

  పలు కోణాల్లో కేసు దర్యాఫ్తు

  సౌమ్య తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హత్య మిస్టరీని ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత భర్తను అనుమానించిన పోలీసులు, చివరకు అతడి స్నేహితుడే ఈ దురాగతానికి ఒడిగట్టాడని నిర్ధారించారు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఎర్రగడ్డ నందనగర్‌లోని అపార్టుమెంట్‌లో సౌమ్య హత్య జరిగింది. సోమవారం అర్థరాత్రి ఇది జరిగింది. ఎలాంటి ఆనవాళ్లు, ఆధారాలు లభించకుండా శరీరంపై నూనె పోసి తగులబెట్టి పారిపోయాడు. సంఘటనా స్థలంలో ఎలాంటి క్లూలు దొరకకపోవడంతో పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేశారు. హత్య జరిగిన సమయంలో భర్త ఇంట్లో లేకపోవడంతో మొదట్లో అనుమానం అతనిపైకి వెళ్లింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యలో భర్త పాత్ర లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో నాలుగు టాస్క్‌ఫోర్సు బృందాలు, సీసీఎస్‌ పోలీసులు, క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో పాటు ఎస్సార్‌నగర్‌కు చెందిన 10 ప్రత్యేక టీమ్‌లు కేసును పరిశోధించాయి.

  తల్లిదండ్రులు చెప్పారు

  తల్లిదండ్రులు చెప్పారు

  నాగభూషణం, సౌమ్యల పెళ్లి 2012లో జరిగింది. నాగభూషణంతో ఉన్న స్నేహం కారణంగా సురేష్‌ తరచూ ఇంటికి వచ్చేవాడు. ఈక్రమంలో సౌమ్యతో చనువు పెరిగింది. భర్తలేని సమయంలో కూడా సురేష్‌ వచ్చి వెళ్లేవాడు. సౌమ్య సురేశ్‌తో చనువుగా ఉంటోందని ఆమె తల్లిదండ్రులకు కూడా ఆ తర్వాత తెలిసిందట. అతనికి దూరంగా ఉండాల్సిందిగా చెప్పారు. తొలుత కేసులో ఏ క్లూ దొరకకపోవడం.. ఇటీవలే సౌమ్య తల్లిదండ్రులు వచ్చి వెళ్లిన విషయం తెల్సుకున్న పోలీసులు వారిని సంప్రదించారు. దీంతో జరిగిన విషయం వారు పోలీసులు చెప్పారు.

  సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా

  సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా

  తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో సురేష్‌ కోసం ఆరా తీశారు పోలీసులు. హత్య జరిగిన రోజు సురేష్‌ సెల్‌ఫోన్‌ లోకేషన్‌ టవర్ల ద్వారా గుర్తించి, అతని ఆనవాళ్లను గుర్తించారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. సురేశ్‌ వద్ద ఉన్న సెల్‌ నెంబర్‌ ద్వారా టవర్‌ లొకేషన్‌ తీసుకున్న పోలీసులు అతనిని పట్టుకున్నారు. అనంతపురం జిల్లా తాడిమర్రిలో కారు నిద్రిస్తుండగా ఎస్సార్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Decoding the sensational murder of a 27-year-old homemaker of SR Nagar, the police on Saturday unravelled the mystery by nabbing a person for allegedly committing the offence.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X