హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ .. రోజు రోజుకూ పెరుగుతున్న కేసులు
తెలంగాణా రాష్ట్రంలో 1,326 కరోనా కేసులు నమోదు కాగా 472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 822 మంది ఇప్పటికే రికార్ అయ్యారు. 32 మంది ఇప్పటి వరకు మృతి చెందారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్ లోనే 796 కరోనా పాజిటి కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . మంగళవారం నాటికి ఈ రోజు ఇప్పటికే 20 కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదు అయ్యాయి అంటే కరోనా హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగిస్తుంది అని చెప్పవచ్చు .
వారం రోజుల కరోనా పాజిటివ్‌ల సంఖ్య తగ్గడంతో అటు అధికారులే కాకుండా ఇటు భాగ్యనగర్ వాసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంతలోనే చాప కింద నీరులా వైరస్ విస్తరిస్తుంది. ముఖ్యంగా చార్మినార్ జోన్‌లోని మలక్‌పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్లలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఎల్బీనగర్, చార్మినార్, ఖైరతాబాద్ జోన్లు కరోనాకు హాట్ స్పాట్స్‌గా మారాయి. అసిఫ్‌నగర్,చాదర్‌ఘాట్, తలాబ్‌కట్ట భవానీనగర్, రెయిన్ బజార్ లలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మర్కజ్ లింకులు, లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన వారి కారణంగానే ఇక్కడ కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.

ఎల్బీనగర్ జోన్ లోని ద్వారకానగర్, సాయినగర్, సచివాలయ కాలనీల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. నాగోల్, లింగోజిగూడ, హుడా సాయినగర్‌లో కాలనీలో కేసులున్నాయి. చాలామందికి కరోనా ఎలా సోకిందనే లింక్ తెలియడం లేదు.మర్కజ్ మూలాలు ఇంకా ఉన్నాయని , సరిగా ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్ట్‌లు చేయకపోవడంతోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు . ఏది ఏమైనా హైదరాబాద్ లో ముఖ్యంగా హాట్ స్పాట్ లు గా మారిన ప్రాంతాలలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఇక లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చెయ్యాల్సిన అవసరం ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications