Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భూపాలపల్లిలో కరోనా టెన్షన్: ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయినప్పటికీ కేసుల నమోదు కొనసాగుతుంది .భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది అని తాజాగా నమోదవుతున్న కేసులతో అర్థమవుతుంది. అన్ని రాష్ట్రాలలోనూ రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది.

తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ కుటుంబంలోని ఒకరు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలోని మిగతా నలుగురు వారి నివాసంలోనే ఐసోలేషన్ లో ఉన్నారు. అయితే వైద్యుల సలహాల మేరకు వారు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు.

Corona fear in bhupalpally: Five people in the same family are corona positive!!

కరోనా మహమ్మారి బారిన పడిన కుటుంబం వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన 65 సంవత్సరాల సుంకర యాదమ్మ మొదట కరోనా బారిన పడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం కి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

ఇక ఆమె కుటుంబంలోని 42 సంవత్సరాల భాస్కర్, 30 సంవత్సరాల వీణ, పిల్లలు ఆకాష్, మిద్దిని కూడా కరోనా బారిన పడ్డారు. వారంతా వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం వీరందరూ బాగానే ఉన్నారని సమాచారం. అయితే ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనా మహమ్మారి బారిన పడటంతో, ఇంకా వారి ద్వారా ఎంతమందికి వ్యాప్తి చెందిందో అన్న ఆందోళన వ్యక్తం అవుతుంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని, బహిరంగ స్థలాలలో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని ఇప్పటికే వైద్యాధికారులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+