తెలంగాణలో కరోనా విలయం.. ఒక్కరోజులో 2,319 కొత్త కేసులు, జీహెచ్ఎంసీలో అత్యధికంగా..

తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,139 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,339 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదుగురు అర్చుకులకు , ఆలయ ఈవో, స్వీపర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఆస్పత్రులలో చేరే వారి సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

కొత్త‌గా 2,139 పాజిటివ్ కేసులు .. ఇద్ద‌రు మృతి

కొత్త‌గా 2,139 పాజిటివ్ కేసులు .. ఇద్ద‌రు మృతి

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 90,021 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 2,139 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఇవి నిన్నటితో ( మంగళవారం) పోలిస్తే దాదాపు 400 కేసులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 474 మంది కరోనా నుంచి కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,047కు చేరింది.

జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,275 కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,275 కేసులు

తెలంగాణలో ప్రస్తుతం 18,339 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు . రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 7,00,094 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,275 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఒక్క సారిగా ఇన్ని కేసులు పెరగ‌డం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఐఐటీలో కరోనా కలకలం

ఐఐటీలో కరోనా కలకలం

హైదరాబాద్ ఐఐటీలో కరోనా కలకలం రేపింది. మొత్తం 119 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు యాజమాన్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. ఇందులో సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలో వీరిని ఉంచడం జరిగిందని, ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది.

చిక్కడపల్లి అర్చ‌కులకు క‌రోనా

చిక్కడపల్లి అర్చ‌కులకు క‌రోనా


అటు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో కరోన కల‌క‌లం రేపింది. దేవాలయంలో పనిచేస్తున్న ఐదుగురు అర్చుకులకు , ఆలయ ఈవో, స్వీపర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఆలయంలో మొత్తం 7 అర్చుకులు, నలుగురు వంటవారు ఉన్నారు. ఆలయ అర్చకులు కరోనా బారిన పడడంతో భక్తుల దర్శనాలు రద్దు చేశారు. గురువారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలా అనుమతి లేదని అధికారులు చెప్పారు.

వేగ‌వంతంగా వ్యాక్సినేష‌న్‌..

వేగ‌వంతంగా వ్యాక్సినేష‌న్‌..

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుందని అధికారులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 2.51 లక్షల మందికి కరోనా టీకా వేసినట్లు చెప్పారు. అటు కరోనా బూస్టర్ డోసును 36,691 మంది తీసుకున్నారని వివరించారు. కరోనా పట్ల అశ్రద్ధ చేయోద్దని వైద్యులు సూచించారు. మొదటి, రెండో డోసు తీసుకోనివారు ఉంటే వెంటనే వేయించుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+