coronavirus: మహిళా కండక్టర్‌కు కరోనా లక్షణాలు: సిటీలో బాధితుడి కుటుంబంపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ భయంతోనే అనుమానితులు, వారి కుటుంబసభ్యులను వెలివేసినట్లు చూస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్ మహేంద్రాహిల్స్ కాలనీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Recommended Video


కరోనా బాధితుడి కుటుంబంపై ఫిర్యాదు..
కరోనావైరస్ బాధితుడి కుటుంబసభ్యులు ఎవరితోనూ కలవద్దని వైద్యులు సూచించినా వినిపించుకోవడం లేదని కాలనీ పెద్దలు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేంద్రహిల్స్ లోని ఓ కాలనీకి చెందిన ఉద్యోగికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అతడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యులు కరోనా బాధితుడి కుటుంబీకులు, అతడితో కలిసి తిరిగిన వారందరికీ పరీక్షలు నిర్వహించారు. వారెవరికీ కరోనా సోకలేదని తేలడంతో ఇళ్లకు పంపించేశారు.

వైద్యులు చెప్పిన బహిరంగ ప్రదేశాల్లో.. స్థానికుల ఆందోళన
అయితే, వైద్యులు వారిని ఇంట్లోనే ఉండాలని, ఎవరితోనూ కలవద్దని చెప్పారని.. కానీ వారు అలా ఉండటం లేదని కాలనీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి కంటోన్మెంట్ సీఈవోకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఇంట్లోని వ్యక్తి ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని కలిసి తిరిగి వారి ఇంటికి వస్తున్నాడని, వారి ద్వారా ఇంకెవరికైనా కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబసభ్యులను బయటతిరగకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇటలీ నుంచి వచ్చి పలు హోటళ్లలో బస చేసిన మహిళ..
మరోవైపు పేట్ బషీరాబాద్ ప్రాంతంలో నివాసముండే 35ఏళ్ల మహిళ ఇటీవల ఇటలీ నుంచి వచ్చింది. ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఇంట్లో ఉండకుండా కొంపల్లి దగ్గర ప్రజయ్ గృహతార అపార్ట్‌మెంట్ల సమీపంలో ఉండే ఓ హోటల్‌లో ఫిబ్రవరి 27,28, 29 తేదీల్లో బస చేసింది. ఇక్కడి హోటల్లోనే కాకుండా షాపూర్ నగర్ లో మరో హోటల్ లో ఆరు రోజులు బస చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈ మహిళ విషయంలోనూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహిళ కండక్టర్ కు కరోనా లక్షణాలు..
ఇది ఇలావుండగా, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో బస్సు బహిళా కండక్టర్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. రిపోర్టులు వచ్చాక ఆమెకు కరోనా ఉందా? లేదా? అనే విషయాలు వెల్లడవుతాయని చెప్పారు. సత్తుపల్లి నుంచి ఏలూరుకు బస్సులో వెళ్లుండగా అస్వస్థతకు గురవడంతో ఆమెను ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆమె బస చేసిన హోటళ్ల వివరాలను పోలీసులు, సంబంధిత అధికారులు సేకరించారు. అయితే, మొదట హోటల్ నిర్వాహకులు ఆమె వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో వారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications