coronavirus: వామ్మో.. అంబులెన్స్‌లో ట్రావెల్, హైదరాబాద్ టు విజయవాడ, ఒక్కొక్కరికి రూ.2,500..
కరోనా వైరస్ ప్రబలుతుండటంతో తెలుగు రాష్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఆదివారం నుంచి సరిహద్దులను మూసివేశాయి. అయితే కొందరు కొత్త ఎత్తుగడ వేశారు. చెక్ పోస్టుల వద్ద కూడా వారిని పట్టుకోకుండా ఉండేందు కోసం అంబులెన్స్‌లను ఎంచుకొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.వెయ్యి నుంచి రూ.2500 తీసుకుంటూ తరలిస్తున్నారు. అనుమానం వచ్చి తనిఖీ చేసిన పోలీసులు.. అందులో ప్రయాణికులు ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు.
బస్సు, రైళ్ల ప్రయాణాలు నిషేధం విధించడంతో ప్రయాణికులను తరలించేందుకు కొత్త మార్గాన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే భారీగా అంబులెన్సులు రావడంతో పోలీసులు అనుమానం వచ్చింది. ఏపీ-తెలంగాణ సరిహద్దు కోదాడ వద్ద వారు అంబులెన్స్ చెక్ చేశారు. అందులో రోగి కాకుండా ప్రయాణికులు ఉండటంతో ఆశ్చర్యపోయారు. అంబులెన్స్ డ్రైవర్లపై కేసు, ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

మార్చి 31వ తేదీ వరకు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఏ వాహనాలను కూడా అనుమతించబోమని తేల్చిచెప్పింది. టూ వీలర్‌పై ఒకరిని, కారులో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications