వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telugu statesలో ప్రమాదకరమైన డబుల్ మ్యూటెంట్: మీ జాగ్రత్తే మీ ప్రాణాలకు శ్రీరామరక్ష..!

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ కనిపించని మహమ్మారికి బలవుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఒక్కసారిగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ కుప్పకూలుతున్నారు. ఇలాంటి దృశ్యాలు భారత్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. మరోవైపు కరోనా పేషెంట్స్ ‌తో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. చాలామందికి ఆక్సిజన్‌తో కూడిన పడకలు లభించక హాస్పిటల్ ఆవరణలోనే తుది శ్వాస విడుస్తున్నారు. హాస్పిటల్స్‌లో వాతావరణంను ఎవరూ వర్ణించలేరు. ఇక మృతిచెందినవారి దహన సంస్కారాలకు స్మశానవాటికలో చోటు దొరకడం లేదు. రోజుకు ఇద్దరు లేదా ముగ్గురిని ఖననం చేసే కాటికాపరులు... ఇప్పుడు రోజుకు 15 నుంచి 20 మందికి దహనసంస్కారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ మేరకు పడిపోయిందో అర్థం అవుతోంది. తాజాగా శాస్త్రవేత్తలు డబుల్ మ్యాటెంట్ గురించి ఓ విషయం చెప్పి మరో బాంబు పేల్చారు.

దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో వైరస్‌కు చెందిన డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 దాడి చేస్తోందని సెంటర్ ఫర్ సెల్యూలర్ మరియు మోలెక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది N440K వేరియంట్‌ను రీప్లేస్ చేసిందని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు. 5వేల వేరియంట్లను సేకరించి వారిని విశ్లేషించనట్లు చెప్పిన శాస్త్రవేత్తలు... N440K వేరియంట్ దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతంగా వ్యాప్తి చెందిందని చెప్పారు. అయితే ఈ మధ్యకాలంలో డబుల్ మ్యూటెంట్ వేరియంట్ B.1.617 వేరియంట్ N440Kని రీప్లేస్ చేస్తూ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని చెప్పాు. ఇది కేరళను కూడా తాకినట్లు సీసీఎంబీలో పనిచేసే మరో శాస్త్రవేత్త దివ్య తేజ్ సోపతి చెప్పారు.

Coronavirus:Double mutant variant replaces N440K in South India

N440K వైరస్ జన్యుక్రమంకు చెందిన మ్యూటెంట్ సెకండ్ వేవ్‌లో అంత ప్రమాదకరం కాదని చెప్పిన శాస్త్రవేత్తలు, ఫస్ట్ వేవ్ తర్వాత ఇది దక్షిణ భారత దేశంలో ప్రతాపం చూపిందని చెప్పారు. అయితే ప్రస్తుతం దీన్ని B1617 మరియు B117 వేరియంట్లు రీప్లేస్ చేశాయని శాస్త్రవేత్తలు వివరించారు. అయితే సెల్ స్ట్రక్చర్‌లో ఈ వేరియంట్ ఒకలా ప్రవర్తిస్తున్నంత మాత్రానా మనుషుల్లో కూడా అలానే ప్రవర్తిస్తుందని చెప్పలేమని తేజ్‌సోపతి చెప్పారు. B.1.617 వేరియంట్‌లో మూడు కొత్త స్పైక్ ప్రొటీన్ మ్యూటేషన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా డబుల్ మ్యూటెంట్ కనిపిస్తోందని ప్రజలు సురక్షితంగా ఉండాలంటే జాగ్రత్త ఒక్కటే ముఖ్యమని వెల్లడించారు.

English summary
Former Centre for Cellular and Molecular Biology (CCMB) director Rakesh Mishra said the double mutant is now a dominant variant in Karnataka, Andhra Pradesh and now Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X