ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డెడ్ చీప్ గా ఖరీదైన స్థలాలు .. మొన్న పువ్వాడ నేడు సండ్ర ?

|
Google Oneindia TeluguNews

టిడిపి నుండి టిఆర్ఎస్ పార్టీ బాట పట్టినందుకు సండ్ర వెంకట వీరయ్యకు బాగానే గిట్టుబాటు అయ్యింది. పార్టీ ఫిరాయించేందుకు భారీ నజరానా బాహాటంగానే దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుండి గెలిచిన సండ్ర వెంకట వీరయ్య పార్టీ ఫిరాయించి గులాబీ బాట పట్టారు . గులాబీ బాస్ ఆపరేషన్ ఆకర్షతో ట్రాప్ లో పడ్డారు . అందుకు ఆయనకు దక్కిన నజరానా తెలిస్తే షాక్ తింటారు .

<strong>కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్</strong>కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్

టీఆర్ఎస్ కు పార్టీ ఫిరాయిస్తే భారీ నజరానా

టీఆర్ఎస్ కు పార్టీ ఫిరాయిస్తే భారీ నజరానా

ఓటుకు నోటు కేసులో ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య పేరు కూడా వుంది . అత‌ను అప్రూవ‌ర్‌గా మారితే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని చాలా కాలంగా వినిపిస్తున్న మాట . అలాంటి వ్య‌క్తిని టీఆర్ఎస్ పార్టీ త‌మ‌వైపు తిప్పుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఏకంగా గులాబీ బాస్ రంగంలోకి దిగి సండ్రకు ఆఫర్ ఇచ్చారు .ఇక దీంతో కేసు నుండి బయట పడొచ్చు , అలాగే కేసీఆర్ ఇచ్చే ఆఫర్ తో అధికార పార్టీలో దర్జాగా ఉండొచ్చు అని భావించి గ‌త నెల 2న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేసీఆర్ ని క‌లిసిన సండ్ర టీఆర్ఎస్ లో చేర‌డానికి సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశారు.

5 కోట్ల విలువ చేసే స్థలం 50 లక్షలకే .. ఎన్నెస్పీ సండ్ర పేరు మీద క్రమబద్ధీకరణ చెయ్యాలని ఆదేశం

5 కోట్ల విలువ చేసే స్థలం 50 లక్షలకే .. ఎన్నెస్పీ సండ్ర పేరు మీద క్రమబద్ధీకరణ చెయ్యాలని ఆదేశం

అయితే అందుకు ఆయ‌న‌కు 5 కోట్ల విలువ‌చేసే ప్ర‌భుత్వ భూమిని దారాద‌త్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలో వున్న నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు మిగులు భూమి (ఎన్నెస్పీ)ని ఖ‌మ్మం ఎమ్మెల్యే సండ్ర పేరిట క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశార‌ని వినిపిస్తోంది. ఖ‌మ్మం సిటీలోని బుర్హాన్ పురం రెవెన్యూ గ్రామంలో గ‌ల స‌ర్వే నంబ‌రు 98లో గ‌ల 1000 గ‌జాల్లో సండ్ర నివాసం వుంది. 2017 లెక్క‌ల ప్ర‌కారం ఇక్క‌డ గ‌జం విలువ 50 వేలు పైమాటే. 24 ఏళ్లుగా ఈ స్థ‌లంలోనే వుంటున్నాను కాబ‌ట్టి దీన్ని త‌న పేర క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని సీఎంను ఆ మ‌ధ్య సండ్ర కోర‌డం, పార్టీలో చేరుతున్నాడు కాబ‌ట్టి సీఎం స‌రే అంటూ ఉత్త‌ర్వులు జారీ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్పుడు దాని విలువ 5 కోట్లు.అది కూడా అత్యవసరంగా పేర్కొని తక్షణం క్రమబద్ధీకరించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది.

భారీ నజరానాతో కాస్ట్‌లీ ఫిరాయింపు .. రాజకీయవర్గాల్లో చర్చ

భారీ నజరానాతో కాస్ట్‌లీ ఫిరాయింపు .. రాజకీయవర్గాల్లో చర్చ

ఇదే నిజ‌మైతే పార్టీ ఫిరాయింపుల్లో ఇదే కాస్ట్‌లీ ఫిరాయింపుగా ఘ‌న‌త‌కెక్కే అవ‌కాశం వుంది. టీడీపీని వీడి టీఆర్ఎస్ కు రావ‌డానికి సండ్రకు వెయ్యి గ‌జాల విలువైన భూమిని దాదాద‌త్తం చేశారా అన్న వార్త ప్ర‌స్తుతం రాజకీయ వర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఇక ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో తెలియాల్సి వుంది .

మొన్న పువ్వాడ అజయ్ కు 10వేల గజాలు క్రమబద్ధీకరణ ... నేడు సండ్రకు

మొన్న పువ్వాడ అజయ్ కు 10వేల గజాలు క్రమబద్ధీకరణ ... నేడు సండ్రకు

ప్రభుత్వ భూములను మార్కెట్‌ విలువ ప్రకారం క్రమబద్ధీకరించడానికి వీలుగా 2014లో ప్రభుత్వం 59జీవోను తెచ్చింది. దీని ప్రకారం 10వేల గజాలను క్రమబద్ధీకరించాలంటూ పువ్వాడ అజయ్‌ దరఖాస్తు చేశారు. అయితే అప్పుడు ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించడం కుదరదని జిల్లా యంత్రాంగం స్పష్టంచేసింది. ఆ తర్వాత ఆయన టీఆర్‌ఎస్ లో చేరగానే 10వేల గజాల స్థలాన్ని నామమాత్రపు ధరకు క్రమద్ధీకరించారు. ఇక తాజాగా సండ్రకు కూడా వెయ్యి గజాల స్థలాన్ని క్రమబద్దీకరించనున్నారు.

English summary
CM KCR gave a huge gift to party defective MLA Sandra Venkata veeraiah . Sandra Venkata Veeraiah has been given a government land worth 5 crores. The Nagarjuna Sagar project surplus land to regularise in the name of Sandra the Chief KCR to ordered. The minimum value is 50 thousand per yard. Since 24 years, Sandra living in this palce . With this reason the land will be regularised on the name of Sandra .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X