రేవంత్ తాత దిగొచ్చినా, హైటెక్ సిటీలోనే గెలవలేదు: టిడిపిని ఆర్జేడితో పోల్చిన సుమన్

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పైన తెరాస నేతలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి గురువారం నాడు తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు. రేవంత్ రెడ్డి ఎన్ని కోట్లకు తెరాస నుంచి టిడిపికి అమ్ముడుపోయారో చెప్పాలని నిలదీశారు.

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ... తెరాస ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తమ పార్టీ నుంచి వలసలు కొనసాగాయని చెప్పారు. ఇప్పుడే రాజకీయ పార్టీల్లో వలసలు ప్రారంభమైనట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

ఎస్పీవై రెడ్డి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీ కండువాను కప్పుకున్నారని ఆరోపించారు. ఏ ప్రలోభాలతో టిడిపిలోకి ఆయనను చేర్చుకున్నారో చెప్పాలన్నారు. ఏ ప్రలోభాలతో వైసిపి నుంచి టిడిపిలోకి అక్కడి ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని నిలదీశారు.

Counter to Revanth Reddy: Balka Suman compares TDP with RJD

రేవంత్ రెడ్డి ఏం ఆశించి తెరాస నుంచి టిడిపిలోకి వెళ్లారని నిలదీశారు. రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒక రోజు తెలుగుదేశం పార్టీని వీడయం ఖాయమని చెప్పారు. హైటెక్ సిటీ ఉన్న డివిజన్ కూడా తెరాస గెలుచుకోలేదన్నారు.

తెలంగాణలో టిడిపి కనుమరుగైందన్నారు. టిడిపి జాతీయ పార్టీ అని చెప్పుకుంటోందని కానీ అది ఒక చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అన్నారు. ఎన్నటికైనా టిడిపి ఏపీకి వెళ్లిపోక తప్పదన్నారు. ఇది చారిత్రక సత్యమన్నారు. బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయాక జార్ఖండ్‌లో ఆర్జేడీ లేదన్నారు.

ఆర్జేడీ బీహార్ పార్టీ కనుక అక్కడకు వెళ్లిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా తెలంగాణలో టిడిపిని రక్షించలేరన్నారు.

రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి తాత, ముత్తాత దిగొచ్చిన టిడిపి తెలంగాణలో బతికి బట్టగట్టే స్థితిలో లేదన్నారు. టిడిపిలో ఒకరిద్దరు మినహా అందరూ తెరాసలో చేరుతారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఓ ఐరన్ లెగ్ అని మండిపడ్డారు.

ఏపీలోని టిడిపి ప్రభుత్వం తెలంగాణ సర్కారు చేపడుతోన్న అభివృద్ధి పథకాలను కాపీ కొడుతోందని జీవన్ రెడ్డి అన్నారు. టిడిపి డబ్బింగ్ సినిమాలు తీస్తోందన్నారు. తెలంగాణలో టిడిపి కనుమరుగైందని, మిగిలింది చంద్రబాబు, లోకేష్ బాబులేనన్నారు.

డబ్బింగ్ సినిమాకు ఒకే ఒక్కడు సినిమా పేరు పెడితే సరిపోతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పచ్చ పార్టీ భూస్థాపితమైందన్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ముగ్గురు నేతలు హైదరాబాద్‌లో గిరగిర తిరిగితే ఒకే స్థానం
దక్కిందని ఎద్దేవా చేశారు.

ఒకే ఒక్కడు, ఒక కార్పొరేటర్, ఒక రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట ఐరన్ లెగ్‌లా దాపురించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలదే తుది నిర్ణయమన్నారు. వరంగల్‌లో కర్రుకాల్చి వాతపెట్టినా టిడిపి నేతలకు బుద్ది రాలేదన్నారు. టిడిపి నేతలు ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు బుద్ది చెబుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+