హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలో తొలిసారి టీకాలు, మందులు డ్రోన్ ద్వారా డెలివరీ: స్కై ప్రాజెక్టు ప్రారంభించిన కేంద్రమంత్రి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా డ్రోన్‌ల సాయంతో ఆకాశమార్గన ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాల్గొన్నారు.

రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాలకు, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు ఔషధాలు, టీకాలను వేగంగా చేరవేయడానికి డ్రోన్లను వినియోగించనున్నారు. డ్రోన్ లో ఔషధాల బాక్సులను పెట్టి జ్యోతిరాదిత్య సింధియా ఈ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మూడు డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలు పంపించారు. ఔషధాలను వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో డ్రోన్లు డెలివరీ చేశాయి.

Countrys first drone delivery: Coronavirus vaccine and medicines from sky project started in vikarabad.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సింధియా మాట్లాడుతూ.. డ్రోన్ టెక్నాలజీ గురించి చాలా విన్నామని, ఇదొక టెక్నాలజీ మాత్రమే కాదని, విప్లవాత్మకమైన చర్యగా ఆయన అభివర్ణించారు. డ్రోన్‌లో కొత్త ఆవిష్కరణ చూస్తున్నట్లు, మానవ మనుగడకు డ్రోన్లు ఈ విధంగా ఉపయోగపడడం సంతోషకరమన్నారు. మందులను డ్రోన్ ల ద్వారా పంపిణీ చేయడం, ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం వేదిక అయ్యిందన్నారు.

డ్రోన్ సేవలు ప్రధాన మంత్రి మోడీ కల అని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో.. కొన్ని కఠినతరమైన చట్టాలను సులభతరం చేశారన్నారు. ఒక డబ్బాలో మెడిసిన్‌ను తీసుకొని వెళ్లడం, ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రతి గ్రామానికి వైద్యం అందుబాటులోకి తీసుకరావాలని, మందులు, వ్యాక్సిన్లు అందచేయాలనే ఈ ప్రయత్నమన్నారు. వ్యాక్సిన్లు దూర ప్రాంతాలకు అందచేయాలంటే ఇక ఇబ్బంది లేకుండా.. డ్రోన్ల ద్వారా చేసుకోవచ్చన్నారు కేంద్రమంత్రి. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్... సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో ముందుకు వెళుదామన్నారు జ్యోతిరాదిత్య సింధియా.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సామాన్యుడికి ఉపయోగం లేని సాంకేతికత వ్యర్థమన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తుంటారని చెప్పారు. రాష్ట్రంలో ఎమర్జింగ్ టెక్నాలజీని ఎంతో ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆధునాతన టెక్నాలజీతో మందులు సరఫరా చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ల ద్వారా మందులు, రక్తం సరఫరా చేస్తామన్నారు. ఆరోగ్య రంగంలోనే గాక, అనేక రంగాల్లో డ్రోన్లు వాడొచ్చన్నారు. మహిళల భద్రత కోసం ఉపయోగించవచ్చని, మైనింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి డ్రోన్ల ద్వారా కట్టడి చేయొచ్చన్నారు.

కాగా, దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు , మందులు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. కరోనా వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా మందులు, టీకాలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్.. తొలిదశలో 11వ తేదీ శనివారం నుంచి సెప్టెంబర్ 11 వరకు వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

Recommended Video

Hero Sai Dharam Tej యాక్సిడెంట్ పై స్పందించిన Actor Naresh || Oneindia Telugu

గత రెండు రోజుల పాటు నిర్వహించిన ట్రయల్ సక్సెస్ అయింది. తొమ్మిది కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు డ్రోన్ సేవలను విస్తరిస్తారు. ఆశ వర్కర్లకు ఇబ్బందులు తప్పనున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలింపే లక్ష్యంగా మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రయల్ రన్​సమయంలో విజువల్ లైన్‌కు ఇవతలివైపు 400 మీటర్ల ఎత్తు వరకు మెడిసిన్ బాక్సును ఈ సంస్థల డ్రోన్లు తీసుకెళ్లాయి. డ్రోన్లు ఎంత కెపాసిటీ పేలోడ్స్​ను తీసుకెళ్తాయి. ఎంత దూరం వెళ్తాయనే అంశాలను ట్రయల్ రన్‌లోనే పరిశీలించారు.

English summary
Country's first drone delivery: Coronavirus vaccine and medicines from sky project started in vikarabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X