వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతుల పట్టివేత
హైదరాబాద్: ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దంపతులతోపాటు విటుడిని, ఓ యువతిని హయత్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోనూ, నగర సమీపంలోనూ వ్యభిచార గృహాల నిర్వహణ ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం - రఫీఉన్నిసాబేగం, ఆమె భర్త అయూషపాషా అలియాస్ ఆలేటి మారుతి దంపతులు. వారు తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్ టౌన్‌షిప్‌లో ఫ్లాట్ నెంబర్ 17ను అద్దెకు తీసుకుని ఏడాది కాలంగా వ్యభిచారగృహాన్ని నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ సమయంలో పడకగదిలో ఉన్న మల్కాజిగిరికి చెందిన 22 ఏళ్ల యువతి, విటుడు శంకర్(35)లతోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
యువతిని రెస్క్యూ హోంకు, నిర్వాహకులను జైలుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications