కారుపై కారు పడి చిన్నారి రమ్య మృతి: శ్రావెల్‌కు నో బెయిల్
హైదరాబాద్: చిన్నారి రమ్య మృతి కేసులో నిందితుడు శ్రావెల్ రెండో సారి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను శనివారం కోర్టు కొట్టేసింది. కేసు తీవ్రత దృష్ట్యా శ్రావెల్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని, శ్రావెల్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టు ముందు వాదించారు.
కారుపై పడిన కారు: చిన్నారి రమ్య బ్రెయిన్ డెడ్, అవయవదానం
రోడ్డు ప్రమాదంలో శ్రావెల్‌తో పాటు కారులో ఉన్న మిగిలిన వారిని నిందితులుగా చేర్చాలని ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. శ్రావెల్‌కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో మూడో సారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అప్పుడు కూడా రాకపోతే హైకోర్టుకు వెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాదులోని నాగార్జున సర్కిల్ వద్ద కారు పైన కారు పడిన ప్రమాదంలో తొమ్మిదేళ్ల చిన్నారి రమ్య మరణించిన విషయం తెలిసిందే. ఆమె బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు రమ్య అవయవాలు దానం చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
చిత్తుగా తాగి బిటెక్ విద్యార్థుల డ్రైవింగ్: కారుపై పడిన మరో కారు, టెక్కీ మృతి
రమ్య సెయింట్ ఆన్స్ హైస్కూల్లో మూడో తరగతి చదువుతోంది. కారు ప్రమాదంలో రమ్య బాబాయి రాజేష్ మృతి చెందగా, రమ్య సహా కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. రమ్య తాత కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications