తెలంగాణలో కరోనా: 1198 కొత్త కేసులు, ఒకేరోజు ఏడుగురు మృతి.. లెక్కల్లో తేడాలన్న బీజేపీ..

గడిచిన వారంతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా హైదరాబాద్ లో కొత్త కేసుల ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,198 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 46,274కి చేరింది. అందులో 34,323 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 11,530 యాక్టివ్ కేసులున్నాయి.

రాష్ట్రంలో రికవరీ రేటు 74శాతంగా ఉందని, మరణాల రేటు 0.91 శాతంగా ఉందని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా వల్ల సోమవారం మరో ఏడుగు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 422కి పెరిగింది. మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 11,003 శాంపిల్స్‌ను పరీక్షించామని, మొత్తంగా 2,65,219 పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

covid-19: 1198 new cases, seven deaths recorded in lans 24 hours in telangana

రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 16.8శాతంగా ఉందని వెల్లడించింది. ఇక ప్రతి 10 లక్షల మందిలో 6,906 మంది పరీక్షలు చేస్తున్నట్లు మీడియా బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 17,081 బెడ్స్ ఉంటే 2,122 మాత్రమే నిండిపోయాయి. ప్రస్తుతం 14,959 ఖాళీగా ఉన్నాయి.

కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కారు దారుణంగా విఫలమైందని, ప్రజల సమాధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని తెలంగాణ బీజేపీ విమర్శించింది. రాష్ట్రం నలుమూలలా జనం కరోనా భయంతో వణికిపోతున్నారని, నమోదవుతున్న కేసులకు, ప్రభుత్వం చెబుతోన్న లెక్కలకు భారీగా తేడాలున్నాయని ఆరోపించింది.

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి.. మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి మంత్రివర్యులే కారణమని, ఆయన జిల్లాలో పర్యటించినప్పుడల్లా వందల మంది గుంపులుగా సంచరిస్తున్నారని, అందుకే వైరస్ వ్యాప్తి చెందుతున్నదని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+