వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై కేసీఆర్ సమీక్ష: హైకోర్టు, మీడియా తీరుపై అభ్యంతరం.. స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారంటూ..

|
Google Oneindia TeluguNews

''కరోనా విషయంలో ఎవరు పడితే వాళ్లు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఒకటీ రెండూ కాదు ఇప్పటికి ఏకంగా 87 పిటిషన్లను కోర్టు స్వీకరించింది. వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, పరీక్షలు-చికిత్స విషయంలో ప్రభుత్వం, వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పటికీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావడం బాధాకరం'' అంటూ సీఎం కేసీఆర్ ఎదుట అధికారులు వాపోయారు.

దీనికితోడు కొన్ని మీడియా సంస్థలు కూడా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కరోనా విషయంలో ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే అభిప్రాయం కలిగించేలా వార్తలు రాస్తున్నాయని, ఇది ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యం దెబ్బతీస్తున్నదని, నిజానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉన్నాయని, మరణాల సంఖ్య తక్కువగా ఉందని, అయినప్పటికీ తాము శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా ఇలాంటి ఆరోపణలు ఎదురవ్వడమేంటని సీఎంతో అధికారులు అన్నారు.

ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ?ఇంకొద్ది గంటల్లో మంత్రిగా ప్రమాణం.. సీదిరి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఎవరికి ఏ శాఖ?

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏపీలో కరోనా నియంత్రణలో మెరుగ్గా ఉండగా, తెలంగాణలో మాత్రం ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం నిద్రపోతున్నదంటూ రాష్ట్ర హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సమీక్షలో ప్రస్తావన రాగా, అధికారులు తమ ఆవేదనను సీఎంతో పంచుకున్నారు. వైరస్ నిర్ధారిత పరీక్షలు, అందిస్తున్న వైద్యం, తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో పూర్తి వాస్తవాలను, ఖచ్చితమైన సమాచారాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సీఎం అధికారులకు సూచించారు.

covid-19: amid Telangana high court remarks, CM KCR review coronavirus situation

కరోనా పరిస్థితులతోపాటు సాగునీటి ప్రాజెక్టులపైనా సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులపై వివిధ సంస్థలతో ఆర్థిక సహాయానికి సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయని, ప్రభుత్వం తరుపున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధుల సమీకరణ ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉందని, వర్షాకాలం పూర్తి కాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలని చెప్పారు.

మాజీ ప్రధాని కూతురికి కేసీఆర్ ఆఫర్!.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వాణిదేవి?.. టీఆర్ఎస్ అనూహ్య ఎత్తుగడ..మాజీ ప్రధాని కూతురికి కేసీఆర్ ఆఫర్!.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా వాణిదేవి?.. టీఆర్ఎస్ అనూహ్య ఎత్తుగడ..

Recommended Video

Tollywood Director Wise Words On Covid 19 | Oneindia Telugu

నీటి లభ్యత కలిగిన సమయంలో ప్రతీ రోజు గోదావరి నుంచి 4 టిఎంసిలు, కృష్ణా నుంచి 3 టిఎంసిల నీటిని తరలించి రాష్ట్రంలోని కోటి 25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, బడ్జెట్ నిధులతో పాటు వివిధ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టిఎంసిని తరలించే పనులతో పాటు, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

English summary
amid telangana high court serious remarks on govt failure, Chief Minister K. Chandrashekhar Rao held a review meeting on Tuesday at Pragathi Bhavan on Corona situation. he also reviews irrigation projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X