Telanganaలో కరోనా: తగ్గిన ఉధృతి -కొత్తగా 987 కేసులు, ఏడుగురు మృతి -ఖమ్మంలో భారీగా
తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశ విలయం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వరుసగా మూడో రోజు కొత్త కేసులు వెయ్యి మార్కుకు దిగువన వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఖమ్మం జిల్లాలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటం గమనార్హం..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1,21,236 శాంపిళ్లను పరీక్షించగా, 987 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,22,593కు పెరిగింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 130 కేసులు రాగా, ఖమ్మం జిల్లాలో ఏకంగా 102 కొత్త కేసులు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 60, నల్గొండ 69, సూర్యాపేట జిల్లాలో 64 కేసులు నమోదయ్యాయి.

నిన్న ఒక్కరోజే కొవిడ్ మహమ్మారి వల్ల ఏడుగురు మరణించారు. తద్వారా రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 3651కి పెరిగింది. జాతీయ స్థాయిలో మరణాల రేటు 1.3 శాతం కాగా, తెలంగాణలో అది 0.58 శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు.
గడిచిన 24 గంటల్లో 1,362 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, మొత్తం డిశ్చార్జీల సంఖ్య 6,05,455కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.83కాగా, తెలంగాణలో అది 97.24 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం రాష్ట్రంలో 13,487 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications