తెలుగు రాష్ట్రాలలో కోవిడ్ కలకలం, ఒక్క సారిగా - తాజా మార్గదర్శకాలు..!!
కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త వేరియంట్లు వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లను గుర్తించారు. ఏపీ, తెలంగాణలోనూ కొత్త కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాయి. తాజాగా పరీక్షలు.. చికిత్స పైన మార్గదర్శకాలు జారీ చేసాయి.
కర్నూలులో ఇద్దరికి
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కర్నూలు జిల్లాలో మరో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కర్నూలు జీజీహెచ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌కు పరీక్షలు నిర్ వహించగా.. కొవిడ్ నిర్ధారణ అయింది. అలాగే మంత్రాలయం మండలం పరమాన్‌దొడ్డి తండాకు చెందిన 25 ఏళ్ల మహిళ అనారోగ్యంతో వారం రోజుల క్రితం కర్నూలు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెకు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో మూడు కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నిర్ధారణ అయిన ఎమ్మిగ నూరు మండలం కలుగోట్ల రోగిని పాతగైనిక్ విభాగంలోని కోవిడ్ వార్డుకు తరలించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు స్పం దించి ప్రత్యేక కోవిడ్ వార్డును అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని రోగులు కోరుతున్నారు.

వరంగల్ లో ఒకే రోజు
వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు స్పందించారు. నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేద ని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.
అప్రమత్తం కావాల్సిందే
కాగా, తాజాగా కరోనా కేసుల నమోదు.. కొత్త వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళనలకు గురి కానవ సరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న రోగులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని, ఆయాసం ఉండి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు చిన్న పిల్లలు, వృద్ధులు, గుండె, కిడ్నీ, క్యాన్సర్, లివర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఇటు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు. క్షేత్ర స్థాయిలో పరీక్షలు.. చికిత్స పైన అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేక వార్డులను అందుబాటులో ఉంచుతున్నారు.












Click it and Unblock the Notifications