'పన్నీరును సీఎంగా చేయాలనుకున్న బీజేపీకి శృంగభంగం'
తమిళనాడులో పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీకి శృంగభంగం అయిందని సిపిఐ సీనియర్ నేత నారాయణ గురువారం నాడు ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: తమిళనాడులో పన్నీరు సెల్వంను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న భారతీయ జనతా పార్టీకి శృంగభంగం అయిందని సిపిఐ సీనియర్ నేత నారాయణ గురువారం నాడు ఎద్దేవా చేశారు.
తమిళనాడులో ఇప్పటి వరకు ఇంతటి రాజకీయ శూన్యత ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కేంద్రం ఆదేశాలతోనే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు విషయంలో జాప్యం చేశారని ఆరోపించారు. కేంద్రం తమిళనాడులో ఏదో చేయాలనుకుందని, కానీ అంతా రివర్స్ అయిందని అభిప్రాయపడ్డారు.
కాగా, శశికళ పైన పన్నీరు సెల్వం తిరుగుబాటు చేయడానికి బీజేపీ కారణమని చాలా మంది భావిస్తున్నారు. పన్నీరు సెల్వంను సీఎంగా కొనసాగించాలని బీజేపీ భావించింది. అందుకోసం కేంద్రం చక్రం తిప్పిందనే వాదనలు ఉన్నాయి.

అంతేకాదు, స్వయంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా.. పన్నీరు వెనుక ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారని చెప్పారు. కానీ శశికళ అంతకు మించి పావులు కదిపారు.
అయితే ఆ తర్వాత ఆమె అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లారు. దీంతో తన వ్యూహాన్ని మార్చిన శశికళ.. పళనిస్వామిని సీఎంగా తెరపైకి తెచ్చారు. అందరు ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తెచ్చారు. ఈ రోజ పళని స్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications