సమంతకు మాత్రమే ఆ హక్కు, అధికారం..!!
మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీని పైన రాజకీయంగానే కాకుండా.. సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సురేఖను టార్గెట్ చేసారు. ఈ వ్యవహారం పైన నాగార్జున సురేఖ పై కోర్టుకు వెళ్లారు. ఆ తరువాత సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారు. నాగార్జున స్పందన పైన సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సంచలన వ్యాఖ్యలతో
కొద్ది రోజుల క్రితం మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయి. పార్టీ నాయకత్వం సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా సురేఖ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను టార్గెట్ చేసే క్రమంలో సురేఖ చేసిన ఈ వ్యాఖ్యల పైన నాగార్జున కుటుంబంతో పాటుగా సినీ ప్రముఖులు ఘాటుగా స్పందించారు. ఇక, సురేఖ ఆ వ్యాఖ్యలను ఉప సంహరించు కోవటంతో వారంతా శాంతించారు. కానీ, నాగార్జున మంత్రి సురేఖ పైన పరువు నష్టం కేసు దాఖలు చేసారు. కోర్టులో ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది.

సమంత కే ఆ అధికారం
ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం పైన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సంచలన ఆరోపణలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేస్తారా అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. బిగ్ బాస్ ద్వారా పరువు పోగొట్టుకున్న నాగార్జున.. కొండా సురేఖపై కోర్టులో దావా వేశారు. ఏదైనా ఉంటే కోర్టును సమంత ఆశ్రయించిన అర్థం ఉంటుంది గానీ.. బిగ్ బాస్ ద్వారా అన్ పాపులరైన నాగార్జున దావా వేయడమంటే దానికి అర్థమే లేదని మండిపడ్డారు.
నాగార్జున టార్గెట్ గా
మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇంకా దాని గురించి కోర్టుకు పోవాల్సిన పని లేదు. అయినా సరే బిగ్ బాస్ ద్వారా అత్యంత అన్ పాపులరయ్యారని.. పరువు పోగొట్టుకున్న నాగార్జున పరువు నష్టం దావా వేయడమంటే అదొక జోక్ తప్ప మరొకటి కానే కాదని నారాయణ చెపపుకొచ్చారు. గతంలోనూ బిగ్ బాస్ షో నిర్వహణ పైన నారాయణ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారం పైన కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు తిరిగి నాగార్జున లక్ష్యంగా నారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications