హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రియల్టీపై కేసీఆర్: బెంగుళూరు పుల్, హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు క్యూ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో కూడా అవినీతిని నిర్మూలించేందుకు, పారదర్శకత పెంపొందించేందుకు టీఎస్ ఐపాస్‌లాంటి చట్టం రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.

క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, తెలంగాణ శాఖ అధ్యక్షుడు రామిరెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు ఎస్ రామిరెడ్డిల ఆధ్వర్యంలో పలువురు సమాఖ్య ప్రతినిధులు క్యాంపు ఆఫీసులో శనివారం కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రియల్టీ వ్యాపారం సైతం పారదర్శకంగా సాగాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇబ్బందుల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఓ సమాఖ్యగా ఏర్పడి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) పరిసర ప్రాంతాల్లో నాలుగు వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక నగరం నిర్మించాలని సూచించారు.

ప్రపంచంలో ఏ నగరాభివృద్ధిలో అయినా రియల్‌ఎస్టేట్ రంగానిది చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులు కీలక భూమిక నిర్వహించాలని అన్నారు.

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కీలక భూమిక పోషించాలని కోరారు. ఆయా దేశాల, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి సూచికగా నిలిచే ఆకాశ హర్మ్యాల నిర్మాణం పట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు దృష్టిపెట్టాలన్నారు.

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

నగరం చుట్టుపక్కల హెల్త్ సీటి, ఫార్మా సిటీ, సినిమా సిటీలు రాబోతున్నాయని తెలిపారు. బెంగళూరు నగరం కిక్కిరిసిపోతున్నందున ఐటి కంపెనీలు కూడా హైదరాబాద్‌కే వస్తున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ అన్నారు.

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరింత వ్యూహాత్మకంగా నగర విస్తరణలో భాగం కావాలని సూచించారు. హైదరాబాద్ నగరం ఇప్పుడే ఇలా ఉంది? భవిష్యత్తులో ఎలా ఉండాలి? అనే విషయంలో హెచ్‌ఎండిఏ రూపొందించే బృహత్తర ప్రణాళికలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భాగం పంచుకోవాలన్నారు.

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

హైదరాబాద్ నగర గమనాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటూనే, ఇతర నగరాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పారు. భూముల లే అవుట్లు, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులిచ్చే విషయంలో అవినీతికి ఆస్కారం లేని కొత్త విధానం తేవడం కోసం ఆలోచన చేస్తున్నామన్నారు.

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

అనుమతులిచ్చే క్రమంలో చాలా ఉదారంగా ఉంటామని, నిబంధనలు పాటించే విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తామని, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ ఉంటుందన్నారు.

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

బెంగుళూరు పుల్, అందుకే హైదరాబాద్‌కు ఐటీ కంపెనీలు: కేసీఆర్

సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంజి గోపాల్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి, హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.

English summary
Credai members meet cm kcr at his Camp Office, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X