పెళ్లయ్యాక ప్రియుడితో వెళ్లింది కానీ జంపయ్యాడు, క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. ఇంటర్ చదివిన ఓ ఇరవై యువతి యువతి తన గ్రామానికే చెందిన ఓ వ్యక్తిని ప్రేమించింది. వారిద్దరి మధ్య నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఇదిలా ఉండగా, గత మే 13న ఆ యువతికి వేరే యువకుడితో పెళ్లి జరిగింది.
పదిహేను రోజుల క్రితం ఆమెను భర్త వద్ద ప్రియుడు తీసుకు వెళ్లాడు. విజయవాడలో ఆమెతో ఒకరోజు గడిపి తిరిగి నల్గొండ జిల్లా కోదాడ వద్ద ఇంటికి పంపించాడు. అతను వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఆ యువతి భర్త దగ్గరకు వచ్చింది. దీంతో, భర్త ఆమెతో కాపురం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో పుట్టింటికి చేరిన ఆ యువతి, నిన్న ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి, అతనితో వివాహం చేయాలని డిమాండ్ చేసింది. అది చూసిన ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు.
ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
బేగంపజారులో ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతోన్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరు బేగంబజారులో ఓ దుకాణంలో బెట్టింగును నిర్వహిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. దుకాణం యజమాని అశ్విని కుమార్ సహా పలువురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పోలీసులు రూ.3.5 లక్షల నగదు, ల్యాప్ టాప్, ఆరుసెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications