need 6.8 lakhs: అకౌంటెంట్‌కు సీఎండీ పేరుతో ఈ-మెయిల్, మనీ ట్రాన్స్‌ఫర్, ఫేక్ అని...
సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త పంథాను అనుసరిస్తూ మోసం చేస్తున్నారు. వ్యక్తులనే కాదు కంపెనీలను కూడా ఛీట్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓ కంపెనీని బురిడీ కొట్టించారు. సీఎండీ పేరుతో మెయిల్ పంపించి.. ఏకంగా రూ.6.8 లక్షలు దోచుకున్నారు. తర్వాత అసలు సీఎండీకి సమాచారం పంపించగా.. తాను డబ్బులు పంపించమని అడగలేని అనడంతో అకౌంటెంట్ నోరెళ్లబెట్టారు. కేటుగాళ్లు మోసం చేశారని భావించి సైబర్ పోలీసులను ఆశ్రయించారు.
హైదరాబాద్‌లో పిత్తి ఇంజినీరింగ్ లిమెటిడె్ కంపెనీ ఉంది. అయితే కంపెనీ అకౌంటెంట్‌కు వారం రోజుల క్రితం సీఎండీ నుంచి మెయిల్ వచ్చింది. తాను మీటింగ్‌లో ఉన్నానని.. వెంటనే రూ.6.8 లక్షల నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలని అందులో ఉంది. సీఎండీ పేరుతో మెయిల్ రావడంతో అకౌంటెంట్ వెంటనే స్పందించారు. రూ.6.8 నగదును మెయిల్‌లో ఉన్న వివరాల ఆధారంగా పంపించారు. తర్వాత ధృవీకరించుకుందామని... అసలు సీఎండీకీ మేసెజ్ చేశాడు.

మేసెజ్ చూసి.. తాను డబ్బు అడగలేదని సీఎండీ అనడంతో అకౌంటెంట్ బిత్తరపోయాడు. తనకు వారం క్రితం మెయిల్ వచ్చిందని చూపించాడు. ఆ మెయిల్ ఎవరిదీ, ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీయగా నకిలీదని తేలింది. దీంతో కంపెనీని సైబర్ మోసగాళ్లు ఛీట్ చేశారని అర్థమైంది. వెంటనే వారు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. కంపెనీ ఫిర్యాదు మేరకు.. సైబర్ కేటుగాళ్లను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications