వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

cyber crimes: ఎనీ డెస్క్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని.. సైబర్ క్రిమినల్స్ కొత్త దోపిడీ!!

|
Google Oneindia TeluguNews

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కాస్త ఏమరుపాటుగా ఉన్నా ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలకు తెరతీసి, జనాలను కన్ఫ్యూజన్లో పడేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టకున్నా, పార్సిల్ వచ్చింది అని కాల్ చేసి, తీరా అది క్యాన్సిల్ చేసుకోవాలంటే తాము చెప్పినట్టు చేయాలని కస్టమర్ కేర్ నెంబర్ లతో వినియోగదారులను బురిడీ కొట్టించిన సైబర్ క్రిమినల్స్, ఇక ఇటీవల కాలంలో ఈ కామర్స్ సైట్లలో మీరు చేసిన షాపింగ్ కు మీకు ఫ్రీ గిఫ్ట్ వచ్చాయంటూ కొత్త దోపిడీకి తెరతీశారు.

ఎనీ డెస్క్ యాప్ ద్వారా మోసాలకు పాపడుతున్న సైబర్ క్రిమినల్స్

ఎనీ డెస్క్ యాప్ ద్వారా మోసాలకు పాపడుతున్న సైబర్ క్రిమినల్స్


ఇక ప్రస్తుతం వివిధ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు, ఈ కామర్స్ సంస్థలకు కస్టమర్ కేర్ ఏజెంట్లమని, టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లమని ఫోన్ చేస్తూ ఫోన్లలో, కంప్యూటర్లలో ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఆ యాప్ ద్వారా కస్టమర్ల డబ్బులు కాజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎనీ డెస్క్ ద్వారా ఫ్రాడ్స్ పెరిగిపోయాయి. ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మోసం జరిగిందని గుర్తించిన వినియోగదారులు పోలీస్ స్టేషన్ లకు పరుగులు పెడుతున్నారు.

సైబర్ క్రిమినల్స్ ఎలా ఎనీ డెస్క్ ను ఉపయోగిస్తున్నారు అంటే..

సైబర్ క్రిమినల్స్ ఎలా ఎనీ డెస్క్ ను ఉపయోగిస్తున్నారు అంటే..

ఇక సైబర్ క్రిమినల్స్ ఎలా ఎనీ డెస్క్ ను ఉపయోగిస్తున్నారు అంటే స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లలోని సమస్యలను పరిష్కరించడానికి ఒక టెక్ కంపెనీకి సంబంధించి, లేదా బ్యాంక్ ప్రతినిధిగా చెప్పుకుంటూ సైబర్ క్రిమినల్స్ ఫోన్ చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి 'ఎనీ డెస్క్' వంటి మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోమని మీకు చెప్తారు. అలా చేసుకుంటేనే వారు సహాయం చేయగలము అని చెబుతారు. ఎప్పుడైతే ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో అది అతనికి మీ మొబైల్‌కి రిమోట్ యాక్సెస్‌ను అందిస్తుంది.

ఎనీడెస్క్ ద్వారా మీ ఫోన్లు వాళ్ళ చేతుల్లోకి.. బ్యాంకు ఖాతాలు చోరీ

యాప్ ఇన్‌స్టాలేషన్‌ అయిన తరువాత 9-అంకెల కోడ్ రూపొందించబడుతుంది, దానిని సైబర్ క్రిమినల్ షేర్ చేయమని అడుగుతాడు. ఆపై కొన్ని అనుమతులు మంజూరు చేయమని మిమ్మల్ని అడుగుతాడు. ఒకసారి అతను చెప్పింది చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్ పూర్తిగా అతని నియంత్రణలోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో మీ మొబైల్ బ్యాంకింగ్ కు సంబంధించి పిన్ నంబర్స్ కూడా కూడా చోరీ చేసి మీ మొబైల్ ఫోన్ నుండి డబ్బులను చోరీ చేస్తారు. ఎప్పుడైతే మీ మొబైల్ ఫోన్ సైబర్ నేరగాడి నియంత్రణలోకి వెళ్లిందో, అప్పుడే మీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఉపయోగించి మీ ఖాతాలో డబ్బులు మాయం చేస్తారు.

మోసపూరిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి .. సైబర్ పోలీసుల హెచ్చరిక

మోసపూరిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి .. సైబర్ పోలీసుల హెచ్చరిక

అందుకే యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని లేదా రహస్య సమాచారాన్ని షేర్ చేయమని మిమ్మల్ని అడిగే మోసపూరిత కాల్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి. అటువంటి కాల్‌లను వెంటనే డిస్‌కనెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటికే "ఎనీ డెస్క్" యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇకపై అవసరం లేనట్లయితే, వెంటనే దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఎవరైనా ఫోన్ చేసి ఎనీ డెస్క్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని చెబితే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని గ్రహించి, అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహించండి. వారు చెప్పినట్టు చేస్తే ఫోన్ లో డేటా దొంగలించి, దీంతోపాటుగా ఖాతాలలో ఉన్న డబ్బులను కూడా చోరీ చేసి తీవ్ర నష్టాన్ని కలిగిస్తారు. అందుకే అపరిచిత వ్యక్తుల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.

English summary
Cybercriminals are doing a new fraud by Asking to download any desk app. Cyber police say that if you believe and do, as they say, your accounts will be robbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X