Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

cyber crimes: కరెంట్ బిల్ కట్టాలంటూ లింక్; క్లిక్ చేశారా.. మీ అకౌంట్ ఖాళీ!!

మొబైల్ ఫోన్ లో వచ్చే లింకులు క్లిక్ చేస్తున్నారా? లింకు ఓపెన్ చేసిన తర్వాత అందులో అడిగిన అన్ని వివరాలు ఇస్తున్నారా? అయితే జాగ్రత్త మీరు సైబర్ మోసానికి గురి అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

రోజుకోతరహా మోసాలతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు

రోజుకోతరహా మోసాలతో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ళు

దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాల్లో టాప్ పొజిషన్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల మోసాలకు ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. సైబర్ నేరగాళ్ల ట్రాప్ లో పడి బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేసుకుంటున్నారు. ఇక కాదేదీ మోసం చేయడానికి అనర్హం అన్నట్టు సైబర్ నేరగాళ్లు రోజుకు కొత్త పంథాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ అనుమానం రాకుండా రకరకాలుగా కొత్త తరహా మోసాలకు దిగుతున్నారు.

కరెంట్ బిల్ కట్టాలంటే లింక్ క్లిక్ చెయ్యాలని మెసేజ్ లు ... చేశారా అంతే సంగతి

కరెంట్ బిల్ కట్టాలంటే లింక్ క్లిక్ చెయ్యాలని మెసేజ్ లు ... చేశారా అంతే సంగతి

గత నెలలో కరెంట్ బిల్లు కట్టలేదా? మీ ఇంట్లో కరెంట్ కట్ అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు బిల్ చెల్లిస్తే ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో మీ బిల్లు రిఫ్లెక్ట్ కాలేదు కావచ్చు. వెంటనే బిల్లు కట్టాలంటే లింక్ పై క్లిక్ చేయండి. బిల్ పే చేయండి. ఒకవేళ మీరు బిల్లు కట్టినట్లయితే ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అది ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో మీ బిల్ రిఫ్లెక్ట్ అవుతుంది అని మీకు వచ్చే మెసేజ్ ల విషయంలో అస్సలు స్పందించవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరెంట్ కట్ అవుతుందని బెదిరించి సైబర్ నేరగాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇక ఆ లింక్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఫోన్లో ఉన్న డేటాను చోరీ చేస్తారని, మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు.

ఫోన్ కు వచ్చే లింకులు క్లిక్ చెయ్యకండి.. బ్యాంక్ డీటెయిల్స్ అసలే ఇవ్వకండి

ఫోన్ కు వచ్చే లింకులు క్లిక్ చెయ్యకండి.. బ్యాంక్ డీటెయిల్స్ అసలే ఇవ్వకండి

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇక ఏకంగా సినీ సెలబ్రెటీలతో సైబర్ నేరాల గురించి అవగాహన తీసుకురావడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. పొరపాటున కూడా మొబైల్ ఫోన్ కు వస్తున్న లింకులను క్లిక్ చేయవద్దని, ఇక బ్యాంక్ డీటెయిల్స్ అస్సలు ఇవ్వద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. రోజుకో రకంగా కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలలోని డబ్బులను చోరీ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ క్రైమ్ పోలీసులు నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. ఇంటర్నెట్ సేఫ్టీ లో రెండడుగులు ముందుందామని, దీని కోసం గూగుల్ సేఫ్టీ సెంటర్ ను లాగాన్ అవ్వాలని సూచిస్తున్నారు.

సైబర్ నేరాలు జరిగితే వెంటనే అలెర్ట్ అవ్వండి ... హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చెయ్యండి

సైబర్ నేరాలు జరిగితే వెంటనే అలెర్ట్ అవ్వండి ... హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చెయ్యండి

నేటి ఇంటర్నెట్ యుగంలో అన్ని క్షణాల్లోనే జరిగిపోతున్నాయి అని, ఇదే క్రమంలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయని చెబుతున్న సైబర్ క్రైమ్ పోలీసులు, ఏదైనా సైబర్ మోసం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి కాల్ చేయాలని సూచిస్తున్నారు. త్వరగా పిర్యాదు చేసినట్లయితే జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీలుంటుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ లో వచ్చే మోసపూరిత సందేశాలు, మోసపూరిత లింకుల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+