మొన్న వరంగల్ కలెక్టర్, నేడు సూర్యాపేట ఎస్పీ.. నకిలీ ఖాతాలతో సైబర్ నేరగాళ్ళ బరితెగింపు!!
ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇక మన దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సైబర్ నేరాల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. పోలీసులకు శాంతి భద్రత పరిరక్షణ కంటే ఈ సైబర్ నేరాలను కట్టడి చేయడం పెద్ద సమస్యగా మారుతుంది. సైబర్ నేరాల బారిన సామాన్య ప్రజలే కాదు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా పడుతుండడం సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతుంది.
వరంగల్ కలెక్టర్ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్
మొన్నటికి మొన్న వరంగల్ కలెక్టర్ పి ప్రావీణ్య పేరుతో నకిలీ facebook అకౌంట్ ను తెరిచి కలెక్టర్ ప్రావీణ్య పేరుతో డబ్బులు కావాలని మెసేజ్ లు పంపిన విషయం తెలిసిందే. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ +94776414080 శ్రీలంక నంబర్ నుంచి ఆ సందేశం పంపిన సబైర్ నేరగాళ్ళు డబ్బులు ఫోన్‌పే చేసి, స్క్రీన్ షాట్ షేర్ చేయాలని కోరారు. పలువురికి మేసేజ్‌లు పంపించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు
దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసలు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అందరిని అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరూ డబ్బులు అడిగిన ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు. పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వకండి. మరియు వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ ప్రావీణ్య ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు సైబర్ తలనొప్పి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుతో కూడా నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ని క్రియేట్ చేసి శ్రీలంకకు చెందిన ఫోన్ నెంబర్ తో డబ్బులు పంపించాలని పలువురికి సందేశాలు పంపిస్తున్నారు. దీంతో ఆయన కూడా దయచేసి ప్రజలు ఎవరు ఇటువంటి ఫేక్ సందేశాలను నమ్మకూడదని, ఎవరికి డబ్బులు పంపొద్దు అని కోరారు.

సూర్యాపేట ఎస్పీని వదలని సైబర్ నేరగాళ్ళు
ఇదిలా ఉంటే తాజాగా సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే పేరు మీద రెండు ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపుతూ డబ్బులు అడుగుతున్నారు. సూర్యాపేట ఎస్పీ ఫేస్బుక్ ప్రొఫైల్ ను పోలిన రెండు నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేశారని, వాటి నుండి వచ్చే మెసేజ్ లకు, రిక్వెస్ట్ లకు ప్రజలు స్పందించవద్దు అని ఆయన జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సైబర్ నేరాల బారిన రోజుకొక ఐఏఎస్, ఐపీఎస్ లు
వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు అని, డబ్బులు పంపించవద్దు అని సూర్యాపేట జిల్లా ఎస్పి విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం అని ఎస్పి అన్నారు. రోజుకొక ఐఏఎస్, ఐపీఎస్ లే సైబర్ క్రిమినల్స్ బారిన పడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నది అర్ధం కాకుండా ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications