హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సైబర్ మోసాలు: ఒక్కమెసేజ్ మూల్యం రూ. 36 లక్షలు, జాగ్రత్త అవసరమంటున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. దుర్మార్గపు ఆలోచనలతో అమాయకులను బోల్తా కొట్టించి వారి వద్ద నుంచి భారీగా సొమ్మును దోచుకుంటున్నారు. తప్పుడు మెసేజ్ లు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే పోలీసులు చెబుతున్నా.. కొంతమంది మాత్రం మాయగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు.

తాజాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇలానే రూ. 36 లక్షలు మోసపోయాడు.
సెంషుద్దీన్, అతని కొడుకు నగరంలో నివాసం ఉంటున్నారు. సెంసుద్దీన్ ఫోన్ కు FQ అనే ఆన్‌లైన్ యాప్ నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే వెనుకాముందు ఏమాత్రం ఆలోచించకుండా.. ఆ నెంబర్‌కు ఫోన్ చేశాడు.

Cyber fraud: A man lost Rs 36 lakhs

డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే.. భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని నమ్మబలికారు మాయగాళ్లు. దీంతో సెంషుద్దీన్ 21 లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేశాడు. అంతేగాక, తన కొడుకు చేత రూ. 15 లక్షలను కూడా అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయించాడు. కొన్ని రోజుల అనంతరం ఇన్వెస్ట్ చేసిన దానికి డబ్బులు రాలేదు. ఏమై ఉంటుందని.. ఆ నెంబర్‌కు ఫోన్ చేశాడు. అయితే, ఆ ఫోన్ పని చేయలేదు. తాను మోసపోయానని గ్రహించి... సైబర్ క్రైం పోలీసులు ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, హైదరాబాద్ నగరంలో అమీర్‌పేట్ ప్రాంతంలోనూ ఇలాంటి మోసమే మరోటి చోటు చేసుకుంది. అయితే, ఇక్కడ తెలిసిన వ్యక్తి మోసం చేశాడు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు అలవాటుపడిన ఓ యువకుడు తనను నమ్మిన ప్రాణ స్నేహితుడినే మోసం చేశాడు. స్నేహితుడి డబ్బులు తనకే తెలియకుండా తీసుకుని 1.65లక్షల రూపాయలు మోసం చేశాడు.

అమీర్‌పేటలో ఉండే బాబు, రాము ఫ్రెండ్స్. బాబుకు తెలియకుండా రాము తన స్నేహితుడి బ్యాంకు వివరాలను తీసుకుని ఆన్‌లైన్‌లో గుర్రపు పందాల్లో బెట్టింగ్ పెట్టాడు. డబ్బులు అకౌంట్‌లో చూసుకోగా లేవు. లక్షకు పైగా డబ్బులు మాయమైపోవడంతో.. సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు బాబు.

Recommended Video

SSMB 28 రెండో హీరోయిన్ వేట | Sarkaru Vaari Paata ఓవర్సీస్ రేంజ్ || Oneindia Telugu

ఫిర్యాదు స్వీకరించిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వివరాలను రాబట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు పోలీసులు. స్నేహితుడు రామూనే బాబు అకౌంట్‌లో నుంచి 1.65 రూపాయలు కాజేసినట్లు గుర్తించారు. స్నేహితుడిని మోసం చేసిన రాముని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. రాముపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

English summary
Cyber fraud: A man lost Rs 36 lakhs in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X