హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు; దాదాపు రూ.1.80కోట్ల విలువ చేసే గంజాయి సీజ్

|
Google Oneindia TeluguNews

అల్లం రవాణా మాటున గంజాయి దందా చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురిని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించింది. భారీ మొత్తంలో గంజాయిని మరియు రవాణాకు ఉపయోగించే వాహనాలను స్వాధీనం చేసుకుంది. వీరి వద్దనుండి 1.80 కోట్ల రూపాయల విలువ చేసే ఎనిమిది వందల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Recommended Video

Living Together Relationships Increasing ఓవైపు గంజాయి.. మరోవైపు సహజీవనాలు | Oneindia Telugu
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ .. 800 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ .. 800 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది స్మగ్లర్లు ఒక ముఠాగా ఏర్పడి ఒరిస్సాలోని కోరాపుట్ నుండి మహారాష్ట్రలోని నాసిక్ కు గంజాయి తరలిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ఈ ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తోందని స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు . గంజాయి రవాణా చేస్తున్న అశోక్ ఖులే, అమోల్ అథవాలే, రాహుల్ కుమార్ సింగ్, విలాష్ జగన్నాథ్ ఫచోర్ ఫిరోజ్ మోమిన్, సుదమ్ ఘోటేకర్‌లను అరెస్టు చేశామని, వారి వద్ద నుండి 800 కిలోల ఎండు గంజాయి, గంజాయి రవాణా చేస్తున్న డీసీఎం వ్యాన్, వ్యాన్‌కు ఎస్కార్ట్ చేస్తున్న మరో కారును స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నగరంలోని మియాపూర్‌లో వారి నుంచి గంజాయిని, గంజాయి తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

కిలో గంజాయి మూడు వేలకు కొని, 20 వేలకు అమ్ముతున్న ముఠా

కిలో గంజాయి మూడు వేలకు కొని, 20 వేలకు అమ్ముతున్న ముఠా

హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తరలింపుపై గట్టి నిఘా ఉన్నందున, స్మగ్లర్లు వివిధ మార్గాలను అవలంబిస్తున్నారు. పొలిమేరల గుండా వెళుతున్నారని, ఎటువంటి అనుమానం రాకుండా వివిధ మార్గాల ద్వారా గంజాయిని తరలిస్తున్నారని సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు . వారు కిలో గంజాయిని రూ. 3,000 చొప్పున కొనుగోలు చేశారు మరియు దానిని కిలో రూ. 20,000 చొప్పున విక్రయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. మొత్తం ముఠా సభ్యుల లో ఆరుగురు సభ్యులు పట్టుబడగా ఒడిశాకు చెందిన సప్లయర్ సుభాష్ కుమార్, మహారాష్ట్రలోని నాసిక్ రిసీవర్ వికాస్ జాదవ్ పరారీలో ఉన్నారు.

 మియాపూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు

మియాపూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు

పక్కా సమాచారం మేరకు సైబరాబాద్‌లోని శంషాబాద్‌ మండలం ఎస్‌ఓటీ అధికారులు మియాపూర్‌ పోలీసులతో కలిసి మియాపూర్‌ టోల్‌ప్లాజా సమీపంలో ముఠా ప్రయాణిస్తున్న కారును పట్టుకున్నారు. కారులో ఉన్న ప్రయాణికులను విచారించగా గంజాయి రవాణా చేస్తున్న డీసీఎం వ్యాన్ గురించి వెల్లడించారు. వికాస్ జాదవ్ తో పాటు అరెస్టయిన నిందితులు మహారాష్ట్రకు చెందిన వారని, ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

 గంజాయి దందా ఇలా .. అల్లం రవాణా మాటున గంజాయి

గంజాయి దందా ఇలా .. అల్లం రవాణా మాటున గంజాయి


పరారీలో ఉన్న నిందితులు సుభాష్ కుమార్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు మరియు సరఫరా నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుండగా, ఇతర నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని రవాణా చేస్తున్నారు. అయితే వీరిలో ఎవరికీ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో మూలాలు తెలియవని పేర్కొన్నారు. వికాస్ జాదవ్ 800 కిలోల ఎండు గంజాయికి ఆర్డర్ ఇచ్చాడు. గంజాయి ఆర్డర్ ఓకే అయిన తర్వాత నిందితులు డిసిఎం వ్యాన్‌లో కోరాపుట్ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి ఒడిశా ఏజెన్సీ ప్రాంతం కోరాపుట్ అడవిలో మారుమూల ప్రదేశంలో ఉంచారు. సరఫరాదారులు వాహనాన్ని తీసుకెళ్లి దానిలో గంజాయి లోడ్ చేసి తిరిగి అదే స్థలంలో పార్క్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నిందితులు అల్లం బ్యాగ్ లతోపాటు దాచిన 156 ఐదు కేజీల గంజాయి ప్యాకెట్లను హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న క్రమంలో సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

English summary
Cyberabad police nab interstate cannabis gang. Cyberabad police busted a major inter state Ganja smuggling racket and seized a huge quantity of Ganja and vehicles used for transportation, all worth Rs 1.80 Crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X