కామాంధుల వలలో చిక్కుకుంటున్న వారిలో టెక్కీలే అధికం: షీ టీమ్స్ రిపోర్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో చోటు చేసుకుంటున్న పలు నేరాలకు సంబంధించిన వివరాలను సోమవారం హైదరాబాద్ షీ టీమ్స్ వెల్లడించింది. నగరంలో కామాంధుల వలలో చిక్కుకుని, ప్రేమ పేరిట ఘోరంగా మోసపోతున్న వారిలో ఐటీ కంపెనీల్లో పనిచేసే యువతులే అధికంగా ఉన్నారని తెలిపింది.

సహోద్యోగినులకు ఉన్నతాధికారులు, ఐటీ ఉద్యోగినులకు బడా వ్యాపారవేత్తలు వల వేస్తున్నారని, వారి మాయమాటలను నమ్మి ఆకర్షణలో పడి సర్వస్వమూ అర్పించుకుని ఆపై విలపిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 86 మంది షీ టీమ్స్ ను ఆశ్రయించగా, వీరిలో సగానికి పైగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారే ఉన్నారని వివరించారు.

Cyberabad SHE teams receive 86 complaints in April alone

ఈ 86 ఫిర్యాదుల్లో 22 కేసులు నమోదు చేసి 12 మందిని జైలుకు పంపామని, వీరిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారని తెలిపారు. 4 అత్యాచార కేసులు, 15 లైంగిక వేధింపుల కేసులు, మిగిలిన వారిపై పెట్టీ కేసులు పెట్టామని, 15 మందికి కౌన్సెలింగ్ ఇప్పించామని షీ టీమ్స్ ఇంఛార్జ్ సలీమా వెల్లడించారు.

హైదరాబాద్‌లో 350కి పైగా సాఫ్ట్ వేర్ సంస్థలు ఉండటం, దాదాపు లక్ష మందికి పైగా అమ్మాయిలు పలు రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తుండటంతో, వారి భద్రత నిమిత్తం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఆకతాయిల ఆటలు కట్టిస్తున్నామని ఆమె తెలిపారు.

ఇది ఇలా ఉండగా, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ సేవల కోసం మహిళలు సైబరాబాద్ వాట్స్‌అప్ నెం.9490617444, ఐటీ కారిడార్ గచ్చిబౌలి షీ టీమ్స్ నెం. 9490617352, బాలానగర్ జోన్ షీ టీమ్స్ నెం. 9490617349, మాదాపూర్ జోన్ షీ టీమ్స్ నెం.8332981120, శంషాబాద్ జోన్ షీ టీమ్స్ నెం.9490617354 లకు సంప్రదించాలని పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Cyberabad SHE teams received as many as 86 complaints of eve-teasing, sexual harassment, rape and extortion in a span of one month. The police have arrested 12 persons and remanded them to judicial custody.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి