హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

దేశంలోనే ప్ర్రప్రధమంగా గురువారం నాడు కారు ఫ్రీ ఐటీ కారిడార్‌గా సైబరాబాద్ ఐటీ కారిడర్ చరిత్ర సృష్టించనుంది. నగరంలో ఏర్పడిన కాలుష్యాన్ని కొంతమేరకు తగ్గించేందుకు ప్రతి గురువారం కార్ ఫ్రీ డే నిర్వహించనున్నారు. ఆగస్టు 6న లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది.

తెలంగాణ ఐటీ డిపార్ట్‌మెంట్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో హైదరాబాద్ సాప్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ (హైసా) ఈ నిర్ణయం తీసుకుంది. ఓ అంచనా ప్రకారం నగరంలో దాదాపు 41 శాతం మంది ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు.

దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

ఈ నిర్ణయంతో ప్రతి గురువారం సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో సుమారు 50,000 కార్లకు ఇంటికే పరిమితం కానున్నాయని తెలుస్తోంది. గురువారం నాడు ఐటీ ప్రొపెషనల్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా ప్రత్యేక రవాణా సదుపాయాలను ఏర్పాటు చేస్తన్నట్లు ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ వెల్లడించారు.

 దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

మహిళా ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులతో పాటు 'షీ షటల్స్'ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజారవాణా పట్ల అవగాహన కలిగించడం, పర్యావరణం కాపడటమే లక్ష్యంతో ఈ కార్ ప్రీ డేని నిర్వహించనున్నట్లు హైసియా అధ్యక్షుడు రమేష్ లోగనాథన్ అన్నారు.

 దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

సోమవారం ఉదయం బేగంపేటలోని పర్యాటక్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్ ప్రీ డేకి సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐటీఈ అండ్ సీ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ 'డిజిటల్ తెలంగాణలో భాగమే ఈ కార్ ప్రీ డే. కార్ ప్రీ డేలో మరిన్ని ఐటీ కంపెనీలు భాగస్వామ్యం కావటంతో పాటుగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను' అని అన్నారు.

 దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

దేశంలోనే తొలిసారి: గురువారం 'కారు ఫ్రీ' ఐటీ కారిడార్‌గా సైబరాబాద్

ఈ కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ సందీప్ కుమార్ అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ఉన్న 370కి పైగా బస్సులతో పాటుగా మరో 62 బస్సులను ఆ రోజున జెఎన్టీయూ జంక్షన్, వేవ్ రాక్, ఇనార్బిట్ మాల్, ప్రగతి నగర్, నిజాంపేట, మెహదీపట్నం, లింగంపల్లి మార్గాల్లో నడపనున్నామని ఆర్‌టీసీ రీజినల్ మేనేజర్ కుమరయ్య చెప్పారు.

English summary
The IT corridor in Cyberabad will be the first area in the country where Thursdays will be car-free. An initiative of #Hyderabad Software Exports Association (Hysea) in association with #Telangana IT Department and Transport Department, the aim is to keep at least 50,000 cars off the roads in this corridor every Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X