ఆఫ్రికా స్త్రీ హత్య: పాపపై డైలమా, సింథియా బ్రదర్ గందరగోళం (పిక్చర్స్)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భార్య సింథియాను హత్య చేసిన రూపేష్‌కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం శంషాబాద్ డీసీపీ కార్యాలయం వద్ద ఆమె బంధువులు ఆందోళన నిర్వహించారు. రూపేష్‌కు కఠిన శిక్షను కోరుతూ ఫిర్యాదు చేసేందుకు వారు వచ్చారు.

ఆఫ్రికా స్త్రీ హత్య, ట్విస్ట్: మేమేంటో చూపిస్తామని పీఎస్‌లో బంధువుల హైడ్రామా

ఈ సమయంలో వారి వెంట రూపేష్ - సింథియా ఆరేళ్ల కూతురు కూడా ఉంది. పోలీసులు మాట్లాడుతూ.. సింథియా కుటుంబ సభ్యులు కొందరు హైదరాబాదులో చదువుతున్నారని చెప్పారు. వారు ఆరేళ్ల చిన్నారిని రూపేష్ తల్లి నుంచి తమ సంరక్షణలోకి తీసుకున్నారని తెలిపారు.

Cynthia kin hold demo, seek death for Rupesh

ఆరేళ్ల పాప ఎవరి వద్ద ఉండాలనే విషయమై అందరితోను చర్చిస్తామని తెలిపారు. ఆరేళ్ల చిన్నారిని తామే ఉంచుకుంటామని ఇటు రూపేష్ కుటుంబ సభ్యులు చెబుతుండగా, సింథియా కుటుంబ సభ్యులు కూడా పట్టుబడుతున్నారు.

డీసీపీ కార్యాలయం వద్ద కాంగో నుంచి వచ్చారని భావించినా, చాలామంది ఇక్కడే ఉంటున్నారు. అందులో సింథియా సోదరుడు డేవిస్ ఉన్నాడు. అతను ఆఫ్రికన్ అసోసియేషన్ ప్రతినిధులు, స్నేహితులతో కలిసి అక్కడకు వచ్చాడు. తన సోదరిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.

Cynthia kin hold demo, seek death for Rupesh

తన సోదరి కూతురును చూడాలని పట్టుబట్టాడు. దీంతో, రూపేష్ తల్లి ఆరేళ్ల పాప సానియాను తీసుకు వచ్చింది. ఈ క్రమంలో తాను సానియాను తీసుకు వెళ్తానని కొద్దిసేపు గందరగోళం సృష్టించాడు. పోలీసులు కల్పించుకొని, న్యాయపరంగా తీసుకెళ్లాలని చెప్పడంతో తగ్గాడు. తర్వాత సానియాను నానమ్మతో పంపించారు.

ఆఫ్రికా స్త్రీ హత్య: భార్య శవాన్ని రూపేష్ 16 ముక్కలుగా నరికాడు (ఫొటోలు)

అదే సమయంలో, సింథియా మృతదేహాన్ని కాంగో పంపించాలా, లేక హైదరాబాదులోనే దహనం చేయాలా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పోలీసులు చెప్పారు. సింథియా కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రిలో ఉంచినట్లు చెప్పారు. రూపేష్ పైన కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Relatives of Congolian woman Cynthia protested at the Shamshabad DCP office on Wednesday seeking maximum punishment for her husband Rupesh, who brutally murdered her.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి