కెసిఆర్ కుటుంబ పీఠాలు కదులుతున్నాయి : నిజాయితీకి - నియంతకి మధ్య పోరాటం : కిషన్ రెడ్డి..!!
ఈటెల రాజీనామాతో కెసిఆర్ కుటుంబ పీఠాలు కదులుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ నామినేషన్ లో ఆయన పాల్గొన్నారు. దళిత బంధు పధకానికి ఈటల రాజేందర్ పేరు పెడితేనే సార్ధకం అవుతుందన్నారు.ఈ ఎన్నిక ప్రజా స్వామ్యంకి..నియంతృత్వం కి మధ్య జరుగుతున్న ఎన్నికగా చెప్పుకొచ్చారు. విద్యా వంతులు ఆలోచించాలన్నారు. ఇంత అధికార దుర్వినియోగం, దుర్మార్గ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు ఇంతకు ముందు చూడలేదని చెప్పారు.
నేను నా కుటుంబం మాత్రమే ఉండాలి, మమ్మల్ని ఎవరూ ప్రశించకూడడు అనేది కేసీఆర్ ఆలోచనగా పేర్కొన్నారు. దళిత బంధు తీసుకువచ్చినందుకు బీజేపీ గా గర్వ పడుతున్నామని చెప్పారు. దళిత బంధు క్రెడిట్ ఈటెల రాజేందర్ .. హుజురాబాద్ ప్రజలది.. బీజేపీకే దక్కుతుందన్నారు.తెలంగాణ లోని ప్రతి దళిత కుటుంబం కు నిధులు అందించాలని డిమాండ్ చేసారు.ఈటల రాజేందర్ ఎవరికీ హాని చేసిన వారు కాదన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి అని..కుటుంబ పెత్తనం నిలదీసిన వ్యక్తి అంటూ ప్రశంసించారు.

వందల కోట్లు ఖర్చు పెట్టినా, కేసులు పెట్టినా అడ్డదారులు తొక్కిన ప్రజా నిర్ణయం ముందు నిలబడలేరన్నారు. ఏ ఒక్కరికి అధికారం శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణాను కెసిఆర్ కుటుంబానికి ఎవరు రాసి ఇవ్వలేదని చెబుతూ..స్పష్టమైన తీర్పు రాబోతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధర్మానికి- అధర్మానికి..నితతృత్వనికి- ఆత్మ గౌరవానికి..నీతి -అవినీతికి..కుటుంబం- ప్రజాస్వామ్యానికి..నిజాయితీకి - నియంతకి..మంచికి -చెడుకు మధ్య జరుగుతున్న ఎన్నికగా కిషన్ రెడ్డి విశ్లేషించారు. మూడున్నర కోట్ల ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికగా పేర్కొన్నారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోవడం బీజేపీ రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. అహంకారంతో బరితెగించిన పాలన కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆరోగ్యం, మౌలిక వసతులు, జీవన ప్రమాణాలు పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిగా పని చేస్తుంటే... తెరాస మాత్రం అప్పుల తెలంగాణగా, కుటుంబ తెలంగాణగా మార్చారని దుయ్యబటటారు. ఈటెల రాజేందర్ అసెంబ్లీ లో అడుగు పెట్టాలి.. నియంతృత్వ ప్రభుత్వం ను ప్రశ్నించాలి అంటే ఈ 20 రోజులు అన్నీ త్యాగం చేసి పని చేయాలి అని ప్రతి ఒక్క కార్యకర్త ను కోరుతున్నానన్నారు.
రాష్ట్రం మీద ఎలాంటి వివక్ష లేదు. నిధుల కోత లేదు. అది కెసిఆర్ కుటుంబం విష ప్రచారం. అది వారికి వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. 8 వేల కోట్లతో రింగ్ రోడ్ నిర్మిస్తున్నాం అది చెప్పరని ఫైర్ అయ్యారు. రైతుకి 6 వేలు, వెల్నెస్ సెంటర్స్ , గ్రామ దవాఖానకు పెట్టడంలో హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటామని..అదే విధంగా రోడ్లు కూడా వేయించే భాధ్యత తమదేనని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications