గ్రామ ప్రజల ముందే దళిత మహిళపై దాడి.. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు..!

నల్గొండ జిల్లా పీకే మల్లేపల్లిలో ఇవాళ షాకింగ్ ఘటన జరిగింది. గ్రామసభలో పొదుపు సంఘాల డబ్బుల వివాదంలో దళిత మహిళ, విఓఏ మాధవిపై స్థానిక కాంగ్రెస్ నేత అమర్నాథ్ గౌడ్ దాడికి దిగారు. గ్రామసభలో డబ్బుల విషయంలో వాగ్వాదానికి దిగి, మాధవి చెంప పగలగొట్టి.. విచక్షణారహితంగా జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమర్నాథ్ గౌడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అమర్నాథ్ గౌడ్‌పై క్రైమ్‌ నంబర్‌ 172/2026 గా కేసు నమోదు చేశారు. అంతేకాక భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 74, 115(2), 352 తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టంతో పాటు 2015 లోని సెక్షన్లు 3(1) (r).. 3(1)(s).. 3(2)(va)లను FIR లో పేర్కొన్నారు.

గ్రామ పంచాయితీ వద్ద ఊరి జనం మొత్తం ఉన్నా కూడా మహిళ అని చూడకంగా తీవ్రమైన దుర్భాషలాడుతూ తనపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనను ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన పిలుపు మేరకు చింతపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. మహిళపై దాడికి పాల్పడిన అమర్నాథ్ ను వెంటనే అరెస్ట్ చేసి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. దాంతో మండల కేంద్రంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

Dalitwoman Assault in Mallepally Nalgonda SC ST Atrocities Act case registered against the accused

" నువ్ ఎవరు.. గ్రామ సభకు నువ్ ఎందుకు హాజరైనవ్.. నిన్ను తొలగించాం. నువ్ ఇక్కడికి రావడానికి అవసరం ఏముందు. ఎందకు వచ్చినవ్. చెంపల మీద కొట్టి.. జుట్టు పట్టుకుని ఈడ్చి కింద పడేసి తొక్కిండు. అంతమంది ముందు నా ముఖం చూపించ కుండా చేసిండు. ఆయన నన్ను మూడు నెలల నుంచి ఇబ్బంది పెడుతుండు. డబ్బులు అడిగినందుకు నన్ను టార్గెట్ చేసిండు. ఒక్కరు కూడా నాకు న్యాయం చేయలేదు. మానసికంగా నన్ను వేధించి నేను చనిపోవాలని చూస్తున్నరు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నరు. నిన్న నాపై కక్షపూరితంగానే చేసిండు" అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+